ప్రముఖ టాలీవుడ్ నటి భానుప్రియకు ఈ మధ్య కాలంలో సినిమా ఆఫర్లు ఎక్కువగా రావడం లేదనే సంగతి తెలిసిందే.కొంతకాలం క్రితం ఆమె భర్త మరణించగా ఆమె ప్రస్తుతం అరుదైన ఆరోగ్య సమస్యతో బాధ పడుతున్నారు.
ఈ విషయం తెలిసిన ఆమె అభిమానులు సైతం ఫీలవుతున్నారు.తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో సైతం భానుప్రియ నటించిన సినిమాలు సక్సెస్ సాధించాయి.
కొన్ని సినిమాలలో భానుప్రియ సహాయనటిగా నటించి తన నటనతో అంచనాలకు మించి మెప్పించడం గమనార్హం.తాజాగా ఒక ఇంటర్వ్యూలో భానుప్రియ మాట్లాడుతూ తన కష్టాలకు సంబంధించిన చాలా విషయాలను పంచుకున్నారు.మా వారు చనిపోయిన తర్వాత జ్ఞాపకశక్తి తగ్గిపోయిందని ఆమె అన్నారు.డ్యాన్స్ కు సంబంధించిన హస్త ముద్రలను సైతం నేను మరిచిపోయానని భానుప్రియ కామెంట్లు చేశారు.
ఈ మధ్య కాలంలో ఒక తమిళ మూవీ షూటింగ్ లో పాల్గొన్నానని ఆ సమయంలో డైలాగ్స్ అన్నీ మరిచిపోయానని భానుప్రియ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.నేను డైలాగ్ లను మరిచిపోవడంతో బ్లాంక్ అయ్యానని ప్రస్తుతం ఆరోగ్యం కూడా బాలేదని ఆమె అన్నారు.గతంలో తాను డ్యాన్స్ స్కూల్ పెట్టాలని అనుకున్నానని ప్రస్తుతం ఆ అలోచన విషయంలో వెనక్కు తగ్గనని భానుప్రియ పేర్కొన్నారు.
ప్రస్తుతం మెడిసిన్స్ తీసుకుంటున్నానని ఆమె చెప్పుకొచ్చారు.భానుప్రియ సాధారణ స్థితికి రావాలని ఆమె అభిమానులు భావిస్తుండటం గమనార్హం.ప్రస్తుతానికి మెడిసిన్లు తీసుకుంటున్నానని భానుప్రియ తెలిపారు.
భానుప్రియ తెలుగు సినిమాలకు మాత్రం దూరంగా ఉంటున్నారు.ఛత్రపతి సినిమా తర్వాత భానుప్రియకు ఆ స్థాయి సినిమా అయితే రాలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
టాలీవుడ్ దర్శకులు భానుప్రియకు ఛాన్స్ లు ఇస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.భానుప్రియ సినిమాల్లో కెరీర్ ను కొనసాగిస్తారో లేక సినిమాలకు దూరంగా ఉంటారో చూడాల్సి ఉంది.