అప్పుడు మోనాల్ ఇప్పుడు శోభాశెట్టి.. బిగ్ బాస్ దత్త పుత్రిక ఈ వారం ఎలిమినేట్ కానున్నారా?

సాధారణంగా ఏ షోకు అయినా ప్రేక్షకుల అభిప్రాయం తీసుకుంటున్నారంటే ప్రేక్షకుల అభిప్రాయాలను ఫాలో కావాల్సి ఉంటుంది.అయితే బిగ్ బాస్ షో( Bigg Boss Show ) విషయంలో మాత్రం చెప్పే విషయాలకు జరిగే విషయాలకు పొంతన ఉండదు.

 Shocking Facts About Bigg Boss Eliminations Details Here Goes Viral In Social Me-TeluguStop.com

బిగ్ బాస్ షో సీజన్4 సమయంలో ఎంతో నెగిటివిటీ ఉన్నా 14వ వారం వరకు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగారు.ప్రస్తుతం శోభాశెట్టి( Sobha Shetty ) సైతం బిగ్ బాస్ హౌస్ లో అదే విధంగా కొనసాగుతున్నారు.

శోభాశెట్టిపై ప్రేక్షకుల్లో నెగిటివిటీ అంతకంతకూ పెరుగుతోంది.మెజారిటీ బిగ్ బాస్ షో అభిమానులకు ఆమె ప్రవర్తన నచ్చడం లేదు.అయినప్పటికీ బిగ్ బాస్ హౌస్ లో ఆమె కొనసాగుతున్నారు.అయితే ఈ వారం ఎలిమినేట్ కానున్నానని హౌస్ లో శోభాశెట్టి సైతం పరోక్షంగా కామెంట్లు చేశారు.

ఇప్పటికే శోభాశెట్టికి సంబంధించిన వీడియో సైతం సిద్ధమైందని తెలుస్తోంది.శోభాశెట్టి ఎలిమినేట్ అయితే మిగతా కంటెస్టెంట్లలో ఒకరు మిడ్ వీక్ లో ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది.

Telugu Bigg Boss, Bigg Boss Show, Biggboss, Sobha Shetty-Movie

బిగ్ బాస్ రాబోయే రోజుల్లో మరిన్ని ట్విస్టులు ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారం నిజమవుతుందో లేదో చూడాలి.ఈ సీజన్ లో ఫ్రైజ్ మనీ ( prize money )కూడా కొంతమేర ఎక్కువగా ఉండటంతో ఎవరు విజేతగా నిలుస్తారనే ఆసక్తి అంతకంతకూ పెరుగుతోంది.బిగ్ బాస్ రేటింగ్స్ విషయంలో కూడా పైచేయి సాధిస్తున్న సంగతి తెలిసిందే.

Telugu Bigg Boss, Bigg Boss Show, Biggboss, Sobha Shetty-Movie

బిగ్ బాస్ తెలుగు సీజన్7 ఉల్టా పుల్టా కాన్సెప్ట్ వల్ల సక్సెస్ అయింది.వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లకు పాల్గొనని ఐదు వారాల రెమ్యునరేషన్ దక్కింది.బిగ్ బాస్ షో నిర్వాహకులు ఈ సీజన్ కోసం భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది.

బిగ్ బాస్ షో భవిష్యత్తు సీజన్లకు నాగ్ హోస్ట్ గా వ్యవహరిస్తారో లేదో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube