అప్పుడు మోనాల్ ఇప్పుడు శోభాశెట్టి.. బిగ్ బాస్ దత్త పుత్రిక ఈ వారం ఎలిమినేట్ కానున్నారా?

సాధారణంగా ఏ షోకు అయినా ప్రేక్షకుల అభిప్రాయం తీసుకుంటున్నారంటే ప్రేక్షకుల అభిప్రాయాలను ఫాలో కావాల్సి ఉంటుంది.

అయితే బిగ్ బాస్ షో( Bigg Boss Show ) విషయంలో మాత్రం చెప్పే విషయాలకు జరిగే విషయాలకు పొంతన ఉండదు.

బిగ్ బాస్ షో సీజన్4 సమయంలో ఎంతో నెగిటివిటీ ఉన్నా 14వ వారం వరకు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగారు.

ప్రస్తుతం శోభాశెట్టి( Sobha Shetty ) సైతం బిగ్ బాస్ హౌస్ లో అదే విధంగా కొనసాగుతున్నారు.

శోభాశెట్టిపై ప్రేక్షకుల్లో నెగిటివిటీ అంతకంతకూ పెరుగుతోంది.మెజారిటీ బిగ్ బాస్ షో అభిమానులకు ఆమె ప్రవర్తన నచ్చడం లేదు.

అయినప్పటికీ బిగ్ బాస్ హౌస్ లో ఆమె కొనసాగుతున్నారు.అయితే ఈ వారం ఎలిమినేట్ కానున్నానని హౌస్ లో శోభాశెట్టి సైతం పరోక్షంగా కామెంట్లు చేశారు.

ఇప్పటికే శోభాశెట్టికి సంబంధించిన వీడియో సైతం సిద్ధమైందని తెలుస్తోంది.శోభాశెట్టి ఎలిమినేట్ అయితే మిగతా కంటెస్టెంట్లలో ఒకరు మిడ్ వీక్ లో ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది.

"""/" / బిగ్ బాస్ రాబోయే రోజుల్లో మరిన్ని ట్విస్టులు ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారం నిజమవుతుందో లేదో చూడాలి.

ఈ సీజన్ లో ఫ్రైజ్ మనీ ( Prize Money )కూడా కొంతమేర ఎక్కువగా ఉండటంతో ఎవరు విజేతగా నిలుస్తారనే ఆసక్తి అంతకంతకూ పెరుగుతోంది.

బిగ్ బాస్ రేటింగ్స్ విషయంలో కూడా పైచేయి సాధిస్తున్న సంగతి తెలిసిందే. """/" / బిగ్ బాస్ తెలుగు సీజన్7 ఉల్టా పుల్టా కాన్సెప్ట్ వల్ల సక్సెస్ అయింది.

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లకు పాల్గొనని ఐదు వారాల రెమ్యునరేషన్ దక్కింది.

బిగ్ బాస్ షో నిర్వాహకులు ఈ సీజన్ కోసం భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది.

బిగ్ బాస్ షో భవిష్యత్తు సీజన్లకు నాగ్ హోస్ట్ గా వ్యవహరిస్తారో లేదో తెలియాల్సి ఉంది.

రామ్ చరణ్ సినిమా మీద బుచ్చిబాబు అప్డేట్ ఇవ్వడం లేదు…కారణం ఏంటి..?