Actor Raghuvaran: సినిమాల్లో టాప్ లైఫ్ లో ఫెయిల్ అయిన రఘువరన్ గురించి ఈ విషయాలు తెలుసా?

సౌత్ ఇండియాలో పాపులర్ అయిన ప్రముఖ నటులలో రఘువరన్ ఒకరనే సంగతి తెలిసిందే.150కు పైగా సినిమాలలో రఘువరన్ నటించగా ఈ సినిమాలలో మెజారిటీ సినిమాలలో రఘువరన్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించి విజయాలను సొంతం చేసుకున్నారు.తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో కూడా రఘువరన్ మంచి పేరును సొంతం చేసుకున్నారు.రఘువరన్ గుండెపోటుతో మృతి చెందారు.

 Shocking Facts About Actor Raghuvaran Details, Raghuvaran, Villain Raghuvaran, R-TeluguStop.com

మద్యం మాదక ద్రవ్యాలకు బానిస కావడం వల్లే రఘువరన్ మృతి చెందారు.శివ, పసివాడి ప్రాణం, భాషా సినిమాలు రఘువరన్ కు మంచి పేరును తెచ్చిపెట్టాయి.

ఆటాడిస్తా రఘువరన్ చివరి సినిమా కావడం గమనార్హం.ప్రముఖ జర్నలిస్ట్ ఇమంది రామారావు రఘువరన్ గురించి మాట్లాడుతూ రఘువరన్ బాలచందర్ గారి డిస్కవరీ అని ఆయన కామెంట్లు చేశారు.

సినిమాల్లో టాప్ అయిన రఘువరన్ లైఫ్ లో మాత్రం ఫెయిల్ అయ్యారనే సంగతి తెలిసిందే.

మణిదన్ అనే సీరియల్ రఘువరన్ కు మంచి గుర్తింపును తెచ్చిపెట్టిందని ఇమంది రామారావు పేర్కొన్నారు.

విలన్ అనేవాడికి బుగ్గపై ఘాటు, హాహాకారాలు అవసరం లేదని స్టైలిష్ గా కూడా ఉండవచ్చని రఘువరన్ ప్రూవ్ చేశారని రామారావు అన్నారు.

Telugu Balachander, Raghuvaran, Tollywood-Movie

రఘువరన్ ఎప్పుడూ హోటల్ లో ఉండేవారని ఆయన కామెంట్లు చేశారు.రఘువరన్ ఒక సందర్భంలో ఆరు నెలల్లో నేను చనిపోతానని చెప్పారని రామారావు అన్నారు.

రఘువరన్ డైరెక్టర్ ఏం చెబితే అది మాత్రమే కాకుండా బెస్ట్ ఔట్ పుట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడని ఆయన కామెంట్లు చేశారు.

గురువుగారు బాలచందర్ అంటే ఆయనకు ఎంతో అభిమానమని రామారావు తెలిపారు.భార్య నుదుట కుంకుమ తీయకూడదని రఘువరన్ చెప్పారని ఆయన అన్నారు.సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు రఘువరన్ గురించి వెల్లడించిన విషయాలు వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube