Whatsapp Voice Note : వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్... వాయిస్ నోట్‌ను స్టేటస్ గా పెట్టుకోవచ్చు!

ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది.ముఖ్యంగా స్టేటస్ ఫీచర్‌లో కొత్త అప్‌డేట్స్‌ను తీసుకొస్తోంది.

 Whatsapp New Feature Will Allow Users To Share Voice Notes On Status,whatsapp,vo-TeluguStop.com

కాగా తాజాగా కూడా మరో అద్భుతమైన అప్‌డేట్‌ను తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.ఈ అప్‌డేట్‌ అందుబాటులోకి వస్తే మీరు మీ వాయిస్ నోట్‌ని స్టేటస్ అప్‌డేట్‌గా షేర్ చేసుకోవచ్చు.‘వాయిస్ స్టేటస్ అప్‌డేట్స్‌’ పేరుతో రానున్న ఈ అప్‌డేట్‌ సాయంతో మీరు డైరెక్ట్ గా స్టేటస్ క్రియేషన్ బాక్స్ నుంచే వాయిస్ రికార్డు చేసి దాన్ని పోస్ట్ చేసుకోవచ్చు.

అప్‌కమింగ్ అప్‌డేట్‌తో స్టేటస్ ప్రైవసీ సెట్టింగ్స్‌కి అనుగుణంగా యూజర్లకు ఈ వాయిస్ నోట్స్ షేర్ చేసుకోవడం కుదురుతుంది.

యూజర్లు టెక్స్ట్ స్టేటస్‌తో మీ స్టేటస్ అప్‌డేట్‌లకు 30 సెకన్ల వరకు వాయిస్ నోట్‌ను పోస్ట్ చేయవచ్చు.వాట్సాప్ యూజర్లు ప్రస్తుతానికి స్టేటస్‌లో టెక్స్ట్ టైప్ చేసి పోస్ట్ చేయగలుగుతున్నారు.

అలానే ఫొటో, వీడియోలను పోస్ట్ చేయగలుగుతున్నారు.కానీ ఆడియో ఫైల్స్ షేర్ చేయడం కుదరడం లేదు.

అలానే వాయిస్ నోట్స్ రికార్డ్ చేసి స్టేటస్‌లో పెట్టడం కూడా సాధ్యం కావడం లేదు.కాగా తాజాగా వాట్సాప్ ఈ ఫీచర్ రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది.

Telugu Android, Desktop, Notes, Whatsapp, Whatsapp Beta, Whatsapp Ups-Latest New

ప్రస్తుతానికి డెవలప్మెంట్ స్టేజ్ లోనే ఉన్న ఫీచర్ త్వరలోనే బీటా యూజర్లకు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.ఆపై రెగ్యులర్ యూజర్లకు ఇది రావచ్చు.ఇది మొదటగా ఆండ్రాయిడ్ యూజర్లకు రావచ్చని వాట్సాప్ బీటా ఇన్ఫో వెల్లడించింది.ఇకపోతే డెస్క్‌టాప్‌ యాప్‌లో స్క్రీన్‌ లాక్‌ ఫీచర్‌ను వాట్సాప్ టెస్ట్ చేస్తున్నట్లు ఒక రిపోర్టు వెల్లడించింది.

ఈమధ్య కాలంలోనే కమ్యూనిటీస్, కాల్‌ లింక్‌, గ్రూప్‌ లిమిట్‌ వంటి ఫీచర్లను పరిచయం చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube