బాలయ్యను పవర్ ఫుల్ గా చూపిస్తే బొమ్మ బ్లాక్ బస్టర్.. ఈ సినిమాలు ప్రూవ్ చేసింది ఇదేనంటూ?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలయ్య ( Balakrishna ) కథల ఎంపిక విషయంలో రూట్ మార్చారు.బాలయ్యను పవర్ ఫుల్ గా చూపిస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సెంటిమెంట్ తెరపైకి వస్తోంది.

 Shocking And Interesting Facts About Balakrishna Movies Details, Balakrishna, B-TeluguStop.com

సింహా, లెజెండ్, అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి ప్రూవ్ చేసింది ఇదేనంటూ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఈ సినిమాలలో బాలయ్య కొన్ని సీన్లలో పవర్ ఫుల్ గా కనిపించడంతో పాటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.

సినిమా సినిమాకు వైవిధ్యం చూపిస్తున్న బాలయ్య భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) సినిమాతో మరోమారు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.బాలయ్య మార్కెట్ అంచనాలను మించి పెరుగుతుండగా వరుసగా విజయాలను సాధిస్తున్న బాలయ్య తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా భారీ విజయాలను అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

వయస్సుకు తగిన పాత్రలను ఎంచుకోవడం వల్లే బాలయ్యకు వరుస విజయాలు దక్కుతున్నాయి.

బాలయ్య వయస్సు ప్రస్తుతం 63 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే.ఈ వయస్సులో కూడా బాలయ్య తన ఎనర్జీ లెవెల్స్ తో ఆశ్చర్యపరుస్తున్నారు.యాక్షన్ సీన్స్ లో బాలయ్య ఇచ్చే ఎక్స్ ప్రెషన్లకు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు.

బాలయ్య బాబీ( Balakrishna Bobby Movie ) కాంబో మూవీ బాలయ్య గత సినిమాలను మించి ఉండనుందని తెలుస్తోంది.ఈ సినిమా సెకండాఫ్ లోని కొన్ని సీన్లు వేరే లెవెల్ లో ఉన్నాయని తెలుస్తోంది.

ఒకప్పుడు వరుస ఫ్లాపులు బాలయ్యకు షాకివ్వగా ఇప్పుడు వరుస హిట్లతో బాలయ్య సత్తా చాటుతున్నారు.బాలయ్య వరుసగా విజయాలు సాధిస్తుండటంతో బాలయ్య రెమ్యునరేషన్( Balayya Remuneration ) సైతం ఊహించని రేంజ్ లో పెరుగుతోంది.బాలయ్య సినిమాల ఎంపిక విషయంలో అదుర్స్ అనిపిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో అఖండ 2 ( Akhanda 2 ) తెరకెక్కనుండగా ఈ సినిమాపై కూడా అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకుంటున్న బాలయ్యకు కెరీర్ పరంగా మరింత సక్సెస్ దక్కాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube