రోజుకు ఒక స్పూన్ చొప్పున ఈ పొడిని తీసుకుంటే ఎలాంటి బలహీనత అయిన పరార్ అవుతుంది!

సాధారణంగా ఒక్కోసారి కొంద‌రు శారీరకంగా చాలా బలహీనంగా మారిపోతుంటారు.పోషకాల కొరత, రక్తహీనత ఇందుకు ప్రధాన కారణాలుగా మారుతుంటాయి.

 Consuming One Spoon Of This Powder A Day Will Cure Weakness! Weakness, Energy Bo-TeluguStop.com

అలాగే ఏమైనా జ్వరాలు సోకినప్పుడు కూడా బలహీనంగా తయారవుతుంటారు.ఈ క్ర‌మంలోనే నీరసం, అలసట వంటివి విపరీతంగా వేధిస్తాయి.

ఏ పని చేయలేకపోతుంటారు.అయితే అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయే పొడిని రోజుకు ఒక స్పూన్ చొప్పున తీసుకుంటే ఎలాంటి బలహీనత అయినా పరార్ అవుతుంది.

మరి ఇంతకీ పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు నువ్వులు వేసి వేయించుకోవాలి.

ఆ తర్వాత అదే పాన్ లో ఒక కప్పు ఓట్స్( Oats ), ఒక కప్పు కొబ్బరి తురుము వేసి వేయించుకొని పెట్టుకోవాలి.అలాగే చివరిగా అరకప్పు బాదంపప్పు, అరకప్పు పిస్తా పప్పు, పది వాల్ నట్స్ వేపుకొని పెట్టుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో వేయించుకున్న నువ్వులు, ఓట్స్‌, కొబ్బ‌రి తురుము, బాదం, పిస్తా, వాల్ నట్స్ వేసుకుని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.

Telugu Energybooster, Tips, Healthy, Latest, Weakness-Telugu Health

ఈ పొడిలో పావు టేబుల్ స్పూన్ అల్లం పొడి, పావు టేబుల్ స్పూన్ పసుపు( Turmeric ), పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి, పావు టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి.తద్వారా మన ఎనర్జీ బూస్టర్ పౌడర్ సిద్ధమవుతుంది.ఈ పౌడర్ ను ఒక బాక్స్ లో నింపుకునే ఫ్రిడ్జ్ లో స్టార్ట్ చేసుకోవాలి.

ప్రతిరోజు ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో ఈ పొడిని వన్ టేబుల్ స్పూన్ చొప్పున కలిపి తీసుకోవాలి.

Telugu Energybooster, Tips, Healthy, Latest, Weakness-Telugu Health

తద్వారా బలహీనత( Weakness ) దూరం అవుతుంది.శరీరం దృఢంగా ఆరోగ్యంగా మారుతుంది.నీరసం, అలసట వంటివి వేధించకుండా ఉంటాయి.

రోజంతా ఫుల్ యాక్టివ్ గా, ఎనర్జిటిక్ గా ఉంటారు.అలాగే ఈ పొడిని నిత్యం తీసుకోవడం వల్ల రక్తహీనత దరిచేరదు.

గుండె ఆరోగ్యంగా ఉంటుంది.జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా సైతం పెరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube