కీరవాణి తండ్రి శివశక్తిదత్తా లిరిసిస్ట్, స్క్రీన్ రైటర్, పెయింటర్ గా తనకంటూ ప్రత్యేక పాపులారిటీని సొంతం చేసుకున్నారు.ఎంతో టాలెంటెడ్ అయిన శివశక్తిదత్తా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.
నేను బాధ పడ్డ సందర్భాలు లేవని ఆయన తెలిపారు.కీరవాణి, రాజమౌళి సినిమాలలో బాహుబలి అంటే ఇష్టమని శివశక్తిదత్తా అన్నారు.
రాజమౌళి టేస్ట్ ఎలా ఉంటే అలా సినిమాలు చేస్తాడని ఆయన పేర్కొన్నారు.
సినిమా అనేది నాకు ఫ్యాషన్ అని తుంగభద్ర సైడ్ మేము వలస వెళ్లామని అక్కడ నేను 300 ఎకరాలు కొన్నానని ఆయన తెలిపారు.ఆ ఏరియా అంతటా నాకు పెద్ద పేరు ఉందని శివశక్తిదత్తా పేర్కొన్నారు.50 మైళ్ల దూరంలో అందరికీ నా పేరు తెలుసని నేను అంత పాపులర్ అని ఆయన చెప్పుకొచ్చారు.అయితే తర్వాత కాలంలో మద్రాస్ లో సెటిల్ కావడానికి, సినిమాలు తీయడానికి మొత్తం అమ్మేశామని ఆయన కామెంట్లు చేశారు.
చివరకు ఈరోజు ఎలా రేపు ఎలా అనే పరిస్థితి కూడా వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు.ఘోస్ట్ వర్క్ ఎక్కువగా చేశామని ఆయన తెలిపారు.జానకి రాముడు, కొదమసింహం సినిమాల ద్వారా నిలబడ్డామని శివశక్తిదత్తా పేర్కొన్నారు.
రాజమౌళి ఆ సమయంలో చిన్న పిల్లాడని ఆయన కామెంట్లు చేశారు.మేము ఆరుగురు అన్నాదమ్ములం అని ఆయన వెల్లడించడం గమనార్హం.
హీరో లుక్స్ రాజమౌళికి ఉన్నా అతనికి ఆసక్తి లేదని శివశక్తిదత్తా పేర్కొన్నారు.రాజమౌళి కుటుంబంలో చాలామంది సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే.రాజమౌళి దయ వల్ల రాజమౌళి కుటుంబానికి సైతం మంచి పేరు వచ్చింది.సినిమాలపై ఉన్న ఫ్యాషన్, పిచ్చి వల్లే శివశక్తిదత్తా ఆస్తులు పోగొట్టుకున్నాడని కామెంట్లు వినిపిస్తున్నాయి.కీరవాణి తండ్రి శివశక్తిదత్తాను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.