యువ హీరో శర్వానంద్ సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా తన ప్రయత్నాలు మాత్రం ఆపట్లేదు.ఒకే ఒక జీవితం తర్వాత శర్వానంద్ తన నెక్స్ట్ సినిమాకు కొద్దిగా గ్యాప్ తీసుకున్నాడు.
ప్రస్తుతం శర్వానంద్ తన నెక్స్ట్ సినిమాను శ్రీరాం ఆదిత్య డైరెక్షన్ లో చేస్తున్నాడు.ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారు.
సినిమాలో శర్వానంద్ కి జోడీగా కృతి శెట్టి నటిస్తుంది.ఉప్పెన నుంచి వరుస సినిమాలు చేస్తూ వచ్చిన కృతి శెట్టి మొదట్లో హిట్లు అందుకున్నా ఈమధ్య వరుస ఫ్లాపులు వస్తున్నాయి.
ప్రస్తుతం నాగ చైతన్యతో కస్టడీ సినిమాలో నటిస్తున్న కృతి శెట్టి శర్వానంద్ తో సినిమా చేస్తుంది.ఈ సినిమాతో ఎలాగైనా హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తుంది కృతి శెట్టి.ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉండటం తో కృతి శెట్టి సినిమాపై పూర్తి నమ్మకంగా ఉందని అంటున్నారు.కస్టడీ, శర్వానంద్ సినిమా ఈ రెండు సినిమాలు హిట్ పడితే తప్ప అమ్మడికి టాలీవుడ్ ఫ్యూచర్ ఉండదని చెప్పొచ్చు.
అందుకే ఇక మీదట కథల విషయంలో జాగ్రత్త పడాలని ఫిక్స్ అయ్యింది కృతి శెట్టి.