దయచేసి సిరి హన్మంత్ ను నెగెటివ్ చేయకండి.. షణ్ముఖ్ షాకింగ్ కామెంట్స్!

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో వల్ల షణ్ముఖ్, సిరి హన్మంత్ గురించి సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో నెగిటివ్ కామెంట్లు వినిపించిన సంగతి తెలిసిందే.బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా కొంతమంది షణ్ముఖ్ ను, సిరి హన్మంత్ ను ట్రోల్ చేస్తున్నారు.

 Shanmukh Jaswanth Comments Bigg Boss Siri Negativity In Bigg Boss Show Details,-TeluguStop.com

షణ్ముఖ్ జశ్వంత్ కూడా హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు.మా ప్రవర్తన చాలామందికి నచ్చలేదని నెగిటివ్ గా తీసుకున్నారని షణ్ముఖ్ చెప్పుకొచ్చారు.

మా స్నేహం చాలామందికి నచ్చకపోవచ్చని సిరిని ప్రొటెక్ట్ చేయాలనే ఆలోచనతోనే తాను ఎక్కువ కేర్ తీసుకున్నానని షణ్ముఖ్ కామెంట్లు చేశారు.బిగ్ బాస్ షో ప్రసారమైన ఎపిసోడ్లను తాను ఇప్పటివరకు చూడలేదని షణ్ముఖ్ అన్నారు.

హీరోగా పరిచయం కావాలా? వెబ్ సిరీస్ లలో కొనసాగాలా? అనే విషయంలో తాను ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదని షణ్ముఖ్ వెల్లడించారు.కొత్త సంవత్సరం తర్వాత తాను ఆ విషయంలో నిర్ణయం తీసుకుంటానని షణ్ముఖ్ వెల్లడించారు.

ఫ్రెండ్లీగా, ఎమోషనల్ గా తాము కనెక్ట్ అయ్యామని అందులో సిరి తప్పేం లేదని షణ్ముఖ్ చెప్పుకొచ్చారు.

Telugu Friendship, Negativity, Shanmukh, Siri Hanmanthu, Tollywood, Trolls-Movie

హౌస్ లో తాము ఏ విధంగా ఉన్నామో బయటకు వచ్చిన తర్వాత కూడా అదే విధంగా ఉన్నామని షణ్ముఖ్ కామెంట్లు చేశారు.సిరి హన్మంత్ ను దయచేసి ట్రోల్ చేయవద్దని షణ్ముఖ్ అభిమానులను కోరారు.దీప్తి సునైనాతో మాట్లాడి బ్రేకప్ వ్యవహారాన్ని తేల్చుకుంటానని షణ్ముఖ్ వెల్లడించారు.

Telugu Friendship, Negativity, Shanmukh, Siri Hanmanthu, Tollywood, Trolls-Movie

షణ్ముఖ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.కొంతమంది నెటిజన్లు మాత్రం షణ్ముఖ్ సిరికి దూరంగా ఉంటే బెటర్ అని సూచనలు చేస్తున్నారు.సిరి వల్ల షణ్ముఖ్ జశ్వంత్ కు నష్టమే కానీ లాభం లేదని నెటిజన్లు సైతం అభిప్రాయపడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube