తెగ కష్టపడిపోతున్న షన్ను.. వర్కౌట్స్ చేస్తున్న ఫోటోలు చూసి అభిమానులు ఫిదా!

తెలుగు సినీ ప్రేక్షకులకు యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.యూట్యూబ్ లో వీడియోలు,వెబ్ సిరీస్ ల ద్వారా సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.

 Shanmukh Jaswanth Beast Mode Look After Workout , Shanmukh Jaswanth , Gym Workou-TeluguStop.com

ఇక తనకున్న క్రేజ్ తో షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.ఇక బిగ్ బాస్ షో ద్వారా బోలెడంత నెగెటివిటీని మూటగట్టుకున్నాడు.

బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది అని సంబరపడే లోపే ఆ రియాలిటీ షో ద్వారా ఎంతో నెగిటివిటీ మూటగట్టుకున్నాడు షణ్ముఖ్.ఇక బిగ్ బాస్ హౌస్ లో హగ్గులు, కిస్సు లు రొమాన్స్ తో రెచ్చిపోయాడు.

బోలెడంత పాపులారిటీ తో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన షణ్ముఖ్ బయటకు వచ్చేటప్పుడు అంతకు రెండింతలు నెగిటివిటీ మూట గట్టుకొని బయటకు వచ్చాడు.బిగ్ బాస్ షోలో షణ్ముఖ్, కంటెస్టెంట్ సిరి తో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

ఇక బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత షణ్ముఖ్ జస్వంత్ ప్రియురాలు దీప్తి సునైనా ఏకంగా షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పేసింది.ఆ తర్వాత కొద్ది రోజుల తరువాత దీప్తి సునైనా మళ్లీ ఓకే చెబుతుందా అని షణ్ముఖ్ జస్వంత్ ఎంతగానో ఎదురుచూశాడు.

కానీ దీప్తి నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో వీరిద్దరూ ఎవరికివారు వారి కెరిర్ లపై దృష్టి పెట్టేశారు.ఈ క్రమంలోనే షణ్ముఖ్ జస్వంత్ ఒక వెబ్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడు.తన ఫ్యాన్స్ కోసం యూట్యూబ్ లో వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు షణ్ముఖ్.ఇకపోతే షణ్ముఖ్ ప్రస్తుతం బీస్ట్ మోడ్ లోకి మారబోతున్నాడు.అయితే షణ్ముఖ్ తన ఫిట్ నెస్ పై దృష్టి పెట్టాడో లేక ఏదైనా ప్రాజెక్టు కోసమో తెలియదు కానీ షణ్ముఖ్ జస్వంత్ మాత్రం జిమ్ లో తెగ కష్టపడుతూ కండలు పెంచేస్తున్నాడు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

షణ్ముఖ్ జస్వంత్ను ఆ లుక్ లో చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు.ఆ వీడియోని చూసి అదిరిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మొత్తానికి షణ్ముఖ్ జస్వంత్ తనపై పడ్డ పెద్ద పేరును తొలగించుకోవాలని బాగానే ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube