శక్తి, షాడో, భోళా శంకర్.. మెహర్ రమేష్ ను నమ్మడమే హీరోల పాలిట శాపమైందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్లు స్టార్ హీరో సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కోసం రేయింబవళ్లు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.ఒకవేళ అవకాశం వస్తే ఆ ఛాన్స్ ను ప్రూవ్ చేసుకుని సక్సెస్ ఫుల్ డైరెక్టర్లుగా ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు.

 Shakti, Shadow, Bhola Shankar.. Is Trusting Meher Ramesh The Curse Of The Heroes-TeluguStop.com

అయితే దర్శకుడు మెహర్ రమేష్( Meher Ramesh ) మాత్రం స్టార్ హీరోలు ఎన్ని అవకాశాలు ఇస్తున్నా ఆ హీరోల, ఆ హీరోల అభిమానుల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు.భారీ బడ్జెట్ తో సినిమాలను తెరకెక్కిస్తున్న ఈ డైరెక్టర్ సినిమాలో అన్ని హంగులు ఉండేలా చూసుకుంటున్నా కథ, కథనం విషయంలో తప్పటడుగులు వేస్తుండటంతో సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి.

కంత్రి, బిల్లా సినిమాలతో బాక్సాఫీస్ వద్ద యావరేజ్ మార్కులు వేయించుకున్న మెహర్ రమేష్ 45 కోట్ల రూపాయల బడ్జెట్ తో శక్తి సినిమాను తెరకెక్కించారు.అయితే ఈ సినిమా నిర్మాత అశ్వినీదత్ ( Aswani Dutt )కు ఏకంగా 22 కోట్ల రూపాయల నష్టం మిగిల్చింది.

Telugu Aswani Dutt, Bhola Shankar, Chiranjeevi, Jr Ntr, Meher Ramesh, Shadow, Sh

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన ఈ సినిమా తారక్ అభిమానులకు సైతం నచ్చలేదు.ఈ సినిమాలోని ఎన్టీఆర్ లుక్స్ విషయంలో సైతం విమర్శలు వచ్చాయి.శక్తి సినిమా డిజాస్టర్ అయినా మెహర్ రమేష్ పై నమ్మకంతో విక్టరీ వెంకటేష్ షాడో సినిమాకు పని చేసే అవకాశం ఇచ్చారు.అయితే ఈ సినిమా కూడా అంచనాలను అందుకోలేదు.

Telugu Aswani Dutt, Bhola Shankar, Chiranjeevi, Jr Ntr, Meher Ramesh, Shadow, Sh

ఈరోజు భోళా శంకర్ మూ( Bhola Shankar )వీ విడుదల కాగా ఈ సినిమాకు కూడా చేదు ఫలితం ఎదురైంది.అనిల్ సుంకర 150 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఈ సినిమా కోసం ఖర్చు చేయగా ఈ సినిమా భారీ నష్టాలను మిగిల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.మెహర్ రమేష్ ను నమ్మడమే హీరోల పాలిట శాపమైందా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube