ఒకే సీజన్ లో రెండు పెద్ద సినిమాలు రావడం అనేది మనకి కొత్తేమి కాదు.సంక్రాంతి మరియు దసరా సీజన్స్ లో ఒక్క రోజు గ్యాప్ తో విడుదలైన పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి.
అయితే సంక్రాంతి తప్ప , మిగిలిన సీజన్స్ లో తక్కువ గ్యాప్ లేకుండా వచ్చిన సినిమాలు బాగా నష్టపోయాయి.అలా ఈ ఏడాది డిసెంబర్ 22 వ తారీఖున ప్రభాస్( Prabhas ) ‘సలార్’ మరియు షారుఖ్ ఖాన్ ‘డుంకీ’ చిత్రాలు విడుదలకు సిద్ధం అయ్యాయి.
‘డుంకీ'( Dunki ) చిత్రం డిసెంబర్ 22 న విడుదల అవ్వబోతుంది అని ఏడాది క్రితమే అధికారికంగా ప్రకటించారు మూవీ టీం.కానీ సలార్ టీం సెప్టెంబర్ 28 వ తారీఖున వస్తామని చెప్పి, కొన్ని అనుకోని కారణాల వల్ల డిసెంబర్ 22 వ తేదికి వాయిదా పడింది.ఈ రెండిట్లో ఎదో ఒక సినిమా వాయిదా పడుతుంది అని అందరూ అనుకున్నారు.
కానీ రెండు సినిమాల మేకర్స్ తగ్గేదేలే అనే ధోరణితో వ్యవహరిస్తూ వచ్చారు.అభిమానులతో వారానికి ఒకసారి సోషల్ మీడియా ఇంటరాక్షన్ జరిపే షారుఖ్ ఖాన్( Shah Rukh Khan ) ని అభిమానులు ‘డుంకీ’ సినిమా విడుదల తేదీ ఎప్పుడు అని అడగగా, డిసెంబర్ 22 వ తారీఖున వస్తున్నాం, అందులో ఎలాంటి మార్పు లేదు అని చెప్పుకొచ్చాడు.దీంతో అభిమానులు ఇక క్లాష్ తప్పదని అనుకున్నారు.
అయితే రీసెంట్ గా వినిపిస్తున్న టాక్ ఏమిటంటే అమీర్ ఖాన్ ‘డుంకీ’ చిత్రం ఒక రోజు వెనక్కి వెళ్లిందని అంటున్నారు.ఈ చిత్రాన్ని డిసెంబర్ 22 న కాకుండా, డిసెంబర్ 21 వ తేదీన విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేసినట్టు సమాచారం. ‘సలార్'( Salaar ) చిత్రానికి నార్త్ ఇండియా లో మంచి థియేటర్స్ ఇచ్చే బయ్యర్ ఉన్నాడు.‘డుంకీ’ చిత్రానికి ఆ స్థాయి బయ్యర్ లేడు, ఒకేరోజు విడుదల అయితే కచ్చితంగా ‘డుంకీ’ చిత్రానికే ఎఫెక్ట్ పడుతుంది.
అందుకే సేఫ్ గా ఈ నిర్ణయం తీసుకున్నారని మేకర్స్ అంటున్నారు.ఈ రెండు సినిమాలకు కూడా క్రేజ్ విపరీతంగా ఉంది.3 ఇడియట్స్, పీకే, సంజు, మున్నాభాయ్ ఎంబీబీఎస్ ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తీసిన రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన సినిమా కావడం, దానికి వరుసగా రెండు బ్యాక్ టూ బ్యాక్ వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టిన షారుఖ్ ఖాన్ కలిసి ఈ సినిమా చేస్తుండడం తో కచ్చితంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ సృష్టిస్తుందని అంటున్నారు.అలాగే కేజీఎఫ్ సిరీస్ తర్వాత ప్రశాంత్ నీల్( Prashanth Neel ) ప్రభాస్ తో చేస్తున్న సినిమా కాబట్టే ‘సలార్’ మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి.
ఇలా రెండు డైనోసార్ లాంటి సినిమాలు పోటీ పడబోతుండడం తో ఎవరు విజయం సాధిస్తారు అనే దానిపై ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.