మొన్నటి వరకు కొడుకు పార్టీలు.. నేడు కూతురు.. నైట్ పార్టీలలో ఎంజాయ్ చేస్తున్నా షారుఖ్ ఖాన్ పిల్లలు!

ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు తమ వ్యక్తిగత విషయాలను బయటకు చెప్పుకోరు.ఎందుకంటే కొన్నిసార్లు తమ వ్యక్తిగత విషయాల పట్ల విమర్శలు ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయని చాలా వరకు తెలపరు.

 Shah Rukh Khan Daughter Suhana Khan Enjoying Night Parties, Shah Rukh Khan, Arya-TeluguStop.com

ముఖ్యంగా కుటుంబ విషయాల గురించి కూడా అస్సలు బయటకి రానీకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు.కానీ మీడియా మాత్రం తమ కుటుంబ సభ్యులను కూడా బాగా బయటకు లాగుతుంది.

ఇప్పటికీ చాలామంది సెలబ్రెటీల కుటుంబాలు మీడియా కంట్లో పడి చాలా విమర్శలు ఎదుర్కొంది.ముఖ్యంగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ మాత్రం తన ఫ్యామిలీ విషయంలో బాగా హాట్ టాపిక్ గా మారుతున్నాడు.

గత కొంత కాలం నుండి తన పిల్లల విషయంలో షారుఖ్ ఖాన్ ఎన్నో ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు.గత కొన్ని రోజుల కిందట తన కుమారుడు ఆర్యన్ ఖాన్ బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాడు.

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో కొన్ని రోజుల వరకు ముంబైలో ఆర్థర్ రోడ్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.ఇక ఇటీవలే అతడికి జైలు నుంచి బెయిల్ దొరకటంతో బయటకు వచ్చాడు.ఇంటికి చేరుకున్న ఆర్యన్ కొన్ని రోజుల వరకు ఇంట్లోనే ఉంటున్నాడు.బయటకు తిరగటానికి కూడా అతడికి కొన్ని చర్యలు విధించారు.

కొడుకు ఇలా చేయడంతో షారుఖ్ ఖాన్ బాగా విమర్శలు ఎదుర్కొన్నాడు.కొడుకు పరంగానే కాకుండా కూతురు పరంగా కూడా చాలా విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ గురించి అందరికీ పరిచయమే.ఇంతవరకు సినీ ఇండస్ట్రీ పరిచయం లేకుండా కూడా సోషల్ మీడియా ద్వారా తన పరిచయాన్ని పెంచుకుంది.

సోషల్ మీడియాలో ఆమె చేసే రచ్చ అంతా కాదు.సోషల్ మీడియాలో బాగా పోస్టులు పెడుతూ వైరల్ చేస్తూ ఉంటుంది.నెటిజన్ల నుండి బాగా కామెంట్లు ఎదుర్కొంటుంది.కేవలం 20 ఏళ్ళ వయసులోనే సోషల్ మీడియా స్టార్ గా నిలిచి బాగా హైలెట్ గా మారింది.ఇక తను వేసే డ్రెస్ లను చూస్తే మాత్రం మతి పోవాల్సిందే.

పైగా ఆమె మాట్లాడిన కూడా వైరల్ అవుతుంది.

ఇదిలా ఉంటే తాజాగా నైట్ పార్టీలతో బాగా ఎంజాయ్ చేస్తూ విమర్శలు ఎదుర్కొంటోంది.అంతే కాకుండా తన తండ్రి కూడా తమ వల్ల బాగా ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు.

తాజాగా సుహానా న్యూయార్క్ లో స్నేహితులతో కలిసి నైట్ పార్టీ చేసుకుంది.దీంతో ఆమె అక్కడ దిగిన ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

అందులో ఆమె బ్లాక్ కలర్ డ్రెస్ ధరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.తనతో పాటు మరో ఇద్దరు స్నేహితులు కూడా ఉండగా ఆ ఫోటోలు వైరల్ గా మారాయి.దీంతో నెటిజన్లు మరోసారి ట్రోలింగ్ చేస్తున్నారు.మొన్నటి వరకు కొడుకు పార్టీలు.నేడు కూతురా అంటూ షారుఖ్ ఖాన్ ను ఉద్దేశించి బాగా కామెంట్లు పెడుతున్నారు.

Shah Rukh Khan Daughter Suhana Khan Night Parties

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube