తెలంగాణను అప్పుల పాలు చేయడానికే యాదాద్రి పవర్ ప్లాంట్ అని కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య అన్నారు.యాదాద్రిలో ఒక్కో యూనిట్ ఉత్పత్తికి రూ.9 భారం పడుతుందన్నారు.అసలు యాదాద్రిలో పవర్ ప్లాంట్ ఎందుకు పెట్టారని పొన్నాల ప్రశ్నించారు.
యాదాద్రిలో నీళ్లున్నాయా? లేక బొగ్గు ఉందా ? అని నిలదీశారు.నీళ్లు, బొగ్గు ఉన్న భూపాలపల్లి ప్లాంట్ ను ఎందుకు నిర్లక్ష్యం చేశారని ప్రశ్నించారు.
కేసీఆర్ యాదాద్రి పర్యటన ముమ్మాటికీ ఎన్నికల టూరేనని విమర్శించారు.