టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం నంబర్1 కొరియోగ్రాఫర్ ఎవరనే ప్రశ్నకు శేఖర్ మాస్టర్ పేరు సమాధానంగా వినిపిస్తుంది.తాజాగా ఢీ15 ప్రోమో రిలీజ్ కాగా ఈ ప్రోమోలో శేఖర్ మాస్టర్ భార్య కూడా ఎంట్రీ ఇచ్చారు.
శేఖర్ మాస్టర్ భార్య పేరు సుజాత కాగా శేఖర్ మాస్టర్ స్టేజ్ పైనే భార్యను హగ్ చేసుకున్నారు.ఆ తర్వాత ఒకరికొకరు దండలు మార్చుకుంటూ ఒకరిపై ఒకరు ప్రేమను ప్రదర్శించడం గమనార్హం.
యాంకర్ ప్రదీప్ ఇంట్లో శేఖర్ మాస్టర్ ను ఏమని పిలుస్తారో చెప్పాలని అడగగా నాని అని పిలుస్తానని ఆయన భార్య వెల్లడించారు.ప్రదీప్ వెంటనే నానిగారు అంటూ కామెంట్ చేశారు.
ప్రదీప్ ఒక అమ్మాయితో కలిసి డ్యాన్స్ చేయగా ప్రదీప్ అలా డ్యాన్స్ చేస్తుంటే ప్రతి అమ్మాయికి ఈర్ష్య కలుగుతుందని శ్రద్ధా దాస్ పేర్కొన్నారు.ఈ ప్రోమోకు 3 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులతో ఈ ప్రోమో ఆకట్టుకుంది.
మనం ఎన్ని తప్పులు చేసినా రైట్ చేసినా మనల్ని భరించేది అమ్మ మాత్రమేనని శేఖర్ మాస్టర్ పేర్కొన్నారు.ఈ షో ప్రోమోలో శేఖర్ మాస్టర్ తల్లి ఫోటోతో పాటు శ్రద్ధాదాస్ పేరెంట్స్ ఫోటోలను ప్రదర్శించారు.శేఖర్ మాస్టర్ తన మంచ్ ఆటిట్యూడ్ తో అభిమానులను అంతకంతకూ పెంచుకుంటున్నారు.
శేఖర్ మాస్టర్ కు సోషల్ మీడియాలో కూడా క్రేజ్ పెరుగుతోంది.
స్టార్ హీరోలంతా శేఖర్ మాస్టర్ తో పని చేయడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు.శేఖర్ మాస్టర్ ప్రస్తుతం ఒక సాంగ్ కు 5 లక్షల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.శేఖర్ మాస్టర్ స్టెప్పులు కొత్తగా ఉండటంతో పాటు హీరోల బాడీ లాంగ్వేజ్ కు అనుగుణంగా ఉంటాయని టాక్ ఉంది.
ఈ టాక్ వల్లే ఆయనను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.