హిమాలయాలలో 60 కోట్ల క్రితం నాటి నీటిని కనుగొన్న శాస్త్రవేత్తలు.. ఆ విశేషాలు తెలిస్తే...

భారతదేశం, జపాన్‌( Japan )కు చెందిన శాస్త్రవేత్తలు హిమాలయాలలో పురాతన సముద్రపు నీటిని కలిగి ఉన్న కొన్ని ప్రత్యేక శిలలను కనుగొన్నారు.ఈ రాళ్లలో నీటి బిందువులు చిక్కుకున్నాయి.

 Scientists Have Discovered 60 Million Years Old Water In The Himalayas.. If You-TeluguStop.com

అవి దాదాపు 60 కోట్ల సంవత్సరాల వయస్సు గలవని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ( IISc ) సైంటిస్ట్స్‌ తెలుసుకుని ఆశ్చర్యపోయారు.చాలా కాలం క్రితం, భూమి స్నోబాల్ ఎర్త్ గ్లేసియేషన్ అని పిలిచే ఐస్ ఏజ్‌కి వెళ్ళింది.

ఆ తరువాత, సెకండ్ గ్రేట్ ఆక్సిజనేషన్ అని పిలిచే ఒక సంఘటన జరిగింది, ఇది భూమి వాతావరణానికి మరింత ఆక్సిజన్‌ను తీసుకువచ్చింది.సంక్లిష్టమైన జీవ రూపాలను అభివృద్ధి చేయడానికి అనుమతించింది.

శాస్త్రవేత్తలు ఈ సంఘటనల మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవాలనుకున్నారు, కానీ కాలక్రమేణా శిలాజాలు, పురాతన మహాసముద్రాలు కనుమరుగయ్యాయి.అదృష్టవశాత్తూ, హిమాలయాలలోని ఆ శిలలలో పురాతన మహాసముద్రాల నీరు దొరికింది.

ఈ నీళ్లు భూమి గత చరిత్ర రహస్యాన్ని ఛేదించడంలో సహాయపడనున్నాయి.స్నోబాల్ ఎర్త్( Snowball Earth ) సమయంలో అవక్షేపణ బేసిన్లలో కాల్షియం కొరత ఉందని రాళ్ళు చూపిస్తున్నాయి, బహుశా నదులు ఎక్కువగా ప్రవహించనందున ఇది జరిగి ఉండొచ్చు.

ఇది మెగ్నీషియం పెరుగుదలకు కారణమై రాళ్ళు ఏర్పడ్డాయి.ఆ రాళ్లలో పురాతన సముద్రపు నీరు ఉండిపోయింది.

కాల్షియం కొరత అనేది సైనోబాక్టీరియా( Cyanobacteria) అని పిలిచే నెమ్మదిగా పెరుగుతున్న మొక్కలకు అనుకూలమైన పరిస్థితులను సృష్టించి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.సెకండ్ గ్రేట్ ఆక్సిజనేషన్ ఈవెంట్ సమయంలో ఈ మొక్కలు వాతావరణంలోకి ఎక్కువ ఆక్సిజన్‌ను విడుదల చేశాయి.శాస్త్రవేత్తలు తమ పరిశోధనలు కచ్చితమైనవని నిర్ధారించుకోవడానికి పశ్చిమ కుమావోన్ హిమాలయాలలోని వివిధ ప్రాంతాల నుంచి రాళ్లను అధ్యయనం చేశారు.వారి స్టడీలో ఈ రాళ్లు పురాతన సముద్రపు నీటి నుంచే వచ్చాయని తేలింది.

ఈ ఆవిష్కరణ పురాతన మహాసముద్రాలు, భూమిపై జీవితం గురించి మరింత తెలుసుకోవడానికి సహాయపడుతుంది.ఇది మన గ్రహం చరిత్ర గురించి ఇంటరెస్టింగ్ విషయాలను చెప్పగల టైమ్ క్యాప్సూల్‌ను కనుగొనడం లాంటిది!

.

Scientists discover 600

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube