సామాజిక విలువలను పెంపొందించే శాస్త్రీయ విజ్ఞానం అవసరం!

సామాజికంగా, ఆర్థికంగా, మౌలికంగా విద్య అంటే, తెలుసుకోవడం, వ్యక్తులకు ఉపయోగపడే సందర్భాలను పురస్కరించుకొని విద్యను మూడు రకాలుగా విభజించవచ్చు జీవనోపాధికి ఉపయోగపడే ప్రపంచ జ్ఞానాన్ని తెలుసుకునేది జీవిత పరమార్థాన్ని గ్రహించేది మొదటి రకమైన విద్యను పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయాలలో జీవనోపాధికి సరిపోయే జ్ఞానం నైపుణ్యాల రూపేనా సంపాదించవచ్చు.అది చదవడం రాయడం గణించడం తో పాటు అవగాహన శక్తి పెంచుతుంది.

 Scientific Knowledge Is Needed To Develop Social Values , Scientific Knowledge,-TeluguStop.com

సూక్ష్మ దృష్టితో పరిశీలించడం నేర్పుతుంది.రసజ్ఞత ను కలిగిస్తుంది పది మందితో కలిసిమెలిసి తిరగడం సర్దుబాటు చేసుకోవడం అలవడుతుంది.

విద్యలో ప్రావీణ్యం సాధిస్తే కీర్తిని సంపదను పదిమందిలో గౌరవాన్ని పొందవచ్చు.ప్రాపంచిక జ్ఞానాన్ని తెచ్చుకోవడానికి- దిన పత్రికలు, ప్రసార మాధ్యమాలు, గ్రంథాలయాలు, పుస్తకాలు చాలా ఉన్నాయి.

మనం పొందిన జ్ఞానం వ్యక్తులను పరిస్థితులను బట్టి పరిసరాలను అవగాహన చేసుకుంటూ మనల్ని మనకు మలుచుకుంటూ ఆనందంగా అర్ధవంతంగా జీవితాన్ని కొనసాగించడానికి దోహదపడాలి.అదే అందరికీ సౌహార్దం సాంఘిక జీవనానికి ఆవశ్యకం నలుగురిలో కలిసిమెలిసి తిరుగుతూ ఉంటే ఎవరితో ఎలా మలచుకోవాలో అర్థమవుతుంది.

విద్య ఆనందానికి మూలం అయితే ప్రతి విద్యాధికుడు ఆనందంగా ఉండాలి కానీ, కొందరు విశ్వవిద్యాలయ పట్టా పొంది ఉన్నత ఉద్యోగాల్లో ఉన్న సుఖం గా ఉండడం లేదు.ఏ విద్యార్హత లేని కొంతమంది మారుమూల గ్రామాల్లో చాలా ఆనందంగా గడుపు కనిపిస్తుంటారు.

అంటూ జీవితాన్ని ఆనందమయంగా గడపాలంటే కొత్త వివేకం నేర్పు సైతం కావాలి.“విద్య మనలో నిగూఢంగా ఉన్న శక్తియుక్తులను వెలికితీసి కార్యం అనుకుని చేస్తుంది చదువు కేవలం అక్షర జ్ఞానం లేక పేరు చివర తగిలించుకునే రెండు మూడు అక్షరాలతో ఉండి పొట్ట నింపుకునే అర్హత పత్రం కాదు.

సంస్కారం లేని విద్య పరిమళ రైత పుష్పం అందుకని పెద్దలు చదువుతో సంస్కారం కావాలి అంటారు.మనిషి నిరంతర విద్యార్థి విద్యా మనిషికి ప్రపంచాన్ని చదవడం నేర్పాలి జీవన గమ్యాన్ని సూచించి ఒడిదుడుకులను అధిగమించి లక్ష్యాన్ని చేరేలా ప్రేరణ ఇచ్చేలా ఉన్నత విద్య ఉండాలి.

కానీ నేడు విద్యా సంస్థలన్నీ రాజకీయాలతో నిండి పోతున్నట్లు మనం గమనించవచ్చు.విశ్వవిద్యాలయాలలో సామాజిక, ఆర్థిక సాంస్కృతిక, సాంఘిక అంశాలపై విస్తృతంగా అధ్యయనం చేయడం ప్రధాన కర్తవ్యంగా చెప్పవచ్చు.

Telugu Books, Newspapers-Latest News - Telugu

శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని, విశ్వవిద్యాలయంలోనే పెంపొందించే దిశగా పరిశోధనలు జరుపుకుంటారు.మేధోమదనం ద్వారా బయటికి వచ్చే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ విజ్ఞానం నేటి సమాజానికి ఎంతగానో దోహద పడవలసిన అవసరం ఉంది.ఇందుకోసమే విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసినట్లు చెప్పవచ్చు 1948లో ఏర్పాటయిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ దేశంలోని ఉన్నత విద్యను బలోపేతం చేయుటకు అనేక ప్రణాళికలతో అభివృద్ధి పరిచింది.ప్రస్తుతం దేశంలో 2020 లెక్కల ప్రకారం విశ్వవిద్యాలయాలు1000 ఉన్నాయి ఇందులో 54 సెంట్రల్ యూనివర్సిటీ లు, 416 స్టేట్ విశ్వవిద్యాలయాలు, 125 డిముడు విద్యాలయాలు, 159 ఇనిస్టిట్యూషన్స్, 361 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, అంతేకాకుండా ఏ ఐ ఎం ఎస్, ఐ ఐ ఎం ఎస్, ఐ ఐ టి ఎస్, ఐ ఐ ఎస్ ఈ ఆర్ ఎస్, ఎన్ ఐ టి ఐ విద్యాసంస్థలు నిర్వహించబడుతున్నాయి.

ఉన్నత విద్యా సంస్థల లో నాణ్యమైన విద్య అందించుటకు, అంతేకాకుండా విశ్వవిద్యాలయాలు స్వయం ప్రతిపత్తితో వ్యవహరించే విధంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నియమ నిబంధనలు రూపొందించింది.బోధన, పరిశోధన రంగాలకు, జీతభత్యాల నిధులు మంజూరు చేయడం సర్వసాధారణమైన విషయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube