గాడ్ ఫాదర్ గురించి మాట్లాడని రామ్ చరణ్.. కారణం ఏంటో మరీ!?

టాలీవుడ్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో చరణ్ కొద్దిరోజులపాటు మంచి ఊపు మీద కనిపించాడు.

 Ram Charan Not Promoting Godfather Ram Charan, God Father Movie, Chiranjeevi, No-TeluguStop.com

ఈ సినిమా విడుదల అయ్యి మంచి హిట్ అయిన తరువాత సోషల్ మీడియాలో ఎక్కువగా వార్తలు నిలిచారు.ఈవెంట్స్ కి ప్రోగ్రామ్స్ కి రాకపోయినా కూడా చరణ్ పేరు కొద్దిరోజులు సోషల్ మీడియాలో వినిపిస్తూనే వచ్చింది.

కానీ ఆచార్య సినిమా బెడిసి కొట్టిన తర్వాత రామ్ చరణ్ మాత్రం బయటకు రాలేదు.

అయితే ఆ సినిమా తర్వాత బయటికి రాకపోయేసరికి తదుపరి సినిమా శంకర్ దర్శకత్వంలో సినిమాలో షూటింగ్లో భాగంగా బిజీగా ఉన్నారు అని అందరూ అనుకున్నారు.

ఆ సినిమా షూటింగ్ కూడా అంతంత మాత్రంగానే జరుగుతుంది అనుకుంటే మరి మెగా హీరో ఎందుకు అంతగా సోషల్ మీడియాలో కనిపించడం లేదు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.అయితే మెగాస్టార్ చిరంజీవికి చెర్రీ లూసిఫర్ సినిమా రైట్స్ కొని మరి అప్ప చెప్పాడు.

కానీ సినిమాను ప్రమోట్ చేయడానికి మాత్రం చరణ్ బయటకు రాలేదు.సినిమాను తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుంది అని ఆ సినిమా రైట్స్ ని కొన్న రాంచరణ్ మాత్రం గాడ్ ఫాదర్ సినిమా సక్సెస్ మీట్ లో కనిపించలేదు.

అంతేకాకుండా గాడ్ ఫాదర్ సినిమాను ప్రమోట్ చేయడం కోసం ఏ ఇంటర్వ్యూలలో కూడా పాల్గొనలేదు.మరి రామ్ చరణ్ ఎందుకు తెర వెనుక ఉంటున్నాడు అన్నది ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ ని కలవరిపెడుతోంది.గ మరొకవైపు రామ్ చరణ్ కమర్షియల్ యాడ్స్ నటిస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.ఇటీవలే రామ్ చరణ్ ఒక బైక్ యాడ్ లో నటించాడు.అందువల్లే ఇతర ప్రాజెక్టుల విషయంలో సమయాన్ని కేటాయించలేకపోతున్నారు అని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం.అయితే ఎంత బిజీగా ఉంటే మాత్రం కనీసం సక్సెస్ మీట్ కూడా రావడం కుదరదా ఏంటి? కానీ ఏదో బలమైన కారణం ఉన్నందువల్లే రామ్ చరణ్ తెరపైకి రావడం లేదు అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube