సర్కారు వారి పాట మూవీ ఫస్ట్ రివ్యూ ఇదే.. సినిమాలో అదే అసలు ట్విస్ట్ అంటూ?

మహేష్, కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారు వారి పాట మరో ఐదు రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది.ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాను రికార్డు స్థాయి స్క్రీన్లలో విడుదల చేయనున్నారని సమాచారం అందుతోంది.

 Sarkaru Vaari Paata Movie First Review Details Here Goes Viral Sarkaru Vaari Paa-TeluguStop.com

కీర్తి సురేష్ కు పరశురామ్ కు సర్కారు వారి పాట సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం కీలకం కాగా తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.ఈ సినిమా సెన్సార్ టాక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

వేగంగా సినిమాలు చేసే హీరోగా మహేష్ బాబుకు పేరు ఉండగా కరోనా వల్ల ఈ సినిమా మాత్రం ఆలస్యంగా థియేటర్లలో రిలీజవుతుండటం గమనార్హం.తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం భారీ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తున్న ఏ సినిమా లేకపోవడంతో ప్రేక్షకులకు సర్కారు వారి పాట ఫస్ట్ ఆప్షన్ గా నిలుస్తోంది.

ప్రేక్షకులు ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాకు కూడా టికెట్ రేట్లను పెంచుతారో లేదో క్లారిటీ రావాల్సి ఉంది.

Telugu Censor Review, Review, Kalavati Role, Keerthy Suresh, Mahesh Babu, Samuth

ఇప్పటికే రిలీజైన సర్కారు వారి పాట ట్రైలర్ పాజిటివ్ టాక్ తో రికార్డు స్థాయిలో వ్యూస్ ను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కగా యూ/ఏ సర్టిఫికెట్ ను ఈ సినిమా సొంతం చేసుకుంది.సినిమాలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పంచ్ డైలాగ్స్ పవర్ ఫుల్ గా పేలాయని ఇంటర్వెల్ ట్విస్ట్ ప్రేక్షకులకు మైండ్ బ్లాంక్ అయ్యే విధంగా ఉంటుందని సమాచారం.

Telugu Censor Review, Review, Kalavati Role, Keerthy Suresh, Mahesh Babu, Samuth

ఈ సినిమాకు ఇంటర్వెల్ ట్విస్ట్ హైలెట్ గా నిలవనుందని ప్రేక్షకులు కోరుకునే ఎంటర్టైన్మెంట్ సైతం ఈ సినిమాలో ఉంటుందని తెలుస్తోంది.ప్రేక్షకులకు విందుభోజనంలా సినిమా ఉందని సెన్సార్ సభ్యులు ప్రశంసించారని బోగట్టా.మహేష్ సముద్రఖని కాంబో సీన్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉన్నాయని సమాచారం.

సినిమాలో మాస్ సాంగ్ అద్భుతంగా ఉందని ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించే విధంగా ఈ సాంగ్ ఉంటుందని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube