సర్కారు వారి పాట మూవీ ఫస్ట్ రివ్యూ ఇదే.. సినిమాలో అదే అసలు ట్విస్ట్ అంటూ?

మహేష్, కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారు వారి పాట మరో ఐదు రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది.

ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాను రికార్డు స్థాయి స్క్రీన్లలో విడుదల చేయనున్నారని సమాచారం అందుతోంది.

కీర్తి సురేష్ కు పరశురామ్ కు సర్కారు వారి పాట సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం కీలకం కాగా తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

ఈ సినిమా సెన్సార్ టాక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.వేగంగా సినిమాలు చేసే హీరోగా మహేష్ బాబుకు పేరు ఉండగా కరోనా వల్ల ఈ సినిమా మాత్రం ఆలస్యంగా థియేటర్లలో రిలీజవుతుండటం గమనార్హం.

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం భారీ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తున్న ఏ సినిమా లేకపోవడంతో ప్రేక్షకులకు సర్కారు వారి పాట ఫస్ట్ ఆప్షన్ గా నిలుస్తోంది.

ప్రేక్షకులు ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాకు కూడా టికెట్ రేట్లను పెంచుతారో లేదో క్లారిటీ రావాల్సి ఉంది.

"""/"/ ఇప్పటికే రిలీజైన సర్కారు వారి పాట ట్రైలర్ పాజిటివ్ టాక్ తో రికార్డు స్థాయిలో వ్యూస్ ను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కగా యూ/ఏ సర్టిఫికెట్ ను ఈ సినిమా సొంతం చేసుకుంది.

సినిమాలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పంచ్ డైలాగ్స్ పవర్ ఫుల్ గా పేలాయని ఇంటర్వెల్ ట్విస్ట్ ప్రేక్షకులకు మైండ్ బ్లాంక్ అయ్యే విధంగా ఉంటుందని సమాచారం.

"""/"/ ఈ సినిమాకు ఇంటర్వెల్ ట్విస్ట్ హైలెట్ గా నిలవనుందని ప్రేక్షకులు కోరుకునే ఎంటర్టైన్మెంట్ సైతం ఈ సినిమాలో ఉంటుందని తెలుస్తోంది.

ప్రేక్షకులకు విందుభోజనంలా సినిమా ఉందని సెన్సార్ సభ్యులు ప్రశంసించారని బోగట్టా.మహేష్ సముద్రఖని కాంబో సీన్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉన్నాయని సమాచారం.

సినిమాలో మాస్ సాంగ్ అద్భుతంగా ఉందని ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించే విధంగా ఈ సాంగ్ ఉంటుందని తెలుస్తోంది.

వైరల్ వీడియో: మంచు కొండల్లో హుక్ స్టెప్ తో రెచ్చిపోయిన సీనియర్ హీరోయిన్..