తమిళ చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు శరత్ కుమార్ ( Sarath Kumar )ఒకరు.ఎన్నో సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన ప్రస్తుతం రాజకీయాలలో కూడా కొనసాగుతున్నారు.
తాజాగా శరత్ కుమార్ తమిళ్ క్కుడిగమన్( Tamil Kudimagan Movie ) అనే సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన కులమత విభేదాల గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ…
మనదేశంలో కులమత విభేదాలకు కారణం రాజకీయ నాయకులేనని(Politicians) ఈయన తెలియజేశారు.ఒక మనిషి పుట్టినప్పుడు తన కులం ఏంటి అనే విషయం తెలియదు.పాఠశాలకు వెళ్తున్న సమయంలోను అలాగే కాలేజీకి వెళ్తున్న సమయంలోను కులమత బేధాలు( Caste and religious differences ) గురించి పట్టింపులు లేకుండా ప్రతి ఒక్కరు చాలా స్నేహభావంతో మెలుగుతూ ఉంటారని తెలిపారు.అయితే ఎప్పుడైతే ఒక మనిషి రాజకీయాలలోకి వస్తారో అప్పుడే ఈ కులమత భేదాలు వస్తాయని తెలియజేశారు.
ఇలా కులమత విభేదాలు వచ్చినప్పుడు వాటిని రూపుమాపడానికి వేరే రాజకీయం ఉందని ఈయన తెలియజేశారు.అదే సమానత్వమని దానికోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఈయన సూచించారు.అయితే తాను కూడా రాజకీయాలలో ఉంటూ రాజకీయ నాయకుడు( Political Leader ) గానే కొనసాగుతున్నానని తెలిపారు.కానీ సమానత్వం కోసమే తన భవిష్యత్తు కార్యక్రమాలన్ని ఉంటాయని ఈ సందర్భంగా శరత్ కుమార్ కులమత విభేదాల గురించి మాట్లాడుతూ ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.