తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ చేశారు.
కేంద్రం ఏం ఇచ్చిందో చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని బండి సంజయ్ తెలిపారు.రాష్ట్రానికి ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేశారన్న బండి సంజయ్… ఎందుకు జీతాలు ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులే తెలంగాణ ద్రోహులని ఆరోపించారు.అనంతరం ప్రీతి కేసుపై స్పందించిన ఆయన విచారణను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
ర్యాంగింగ్ తో పాటు లవ్ జిహాద్ కేసు కూడా పెట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.