తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి సినిమా( Arjun Reddy )తో పెను సంచలనాన్ని సృష్టించాడు.
ఆయన ఇప్పుడు ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా కనుక సూపర్ సక్సెస్ అయితే ఆయన క్రేజ్ మామూలు రేంజ్ లో ఉండదు.
ఇప్పటికే అనిమల్ సినిమా( Animal Movie )తో ఒక ప్రభంజనాన్ని సృష్టించాడు.

దాదాపు 900 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టి ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఒక భారీ సంచలనాన్ని క్రియేట్ చేసిందనే చెప్పాలి.ఇక ఇప్పుడు ఆయన చేస్తున్న ఈ సినిమా తో మరోసారి తన సత్తా ఏంటో చూపించుకోవాలని చూస్తున్నాడు.అలాగే ప్రభాస్( Prabhas ) కూడా ఈ సంవత్సరం సలార్ సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్నాడు.
ఈ సినిమా దాదాపు 700 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టింది.కాబట్టి నెక్స్ట్ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న స్పిరిట్ సినిమా( Spirit Movie ) 1000 కోట్లకు పైన కలెక్షన్స్ రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూకుతున్నట్టుగా తెలుస్తుంది.
మరి ఇలాంటి సమయంలో సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) ప్రభాస్ ని ఎలా చూపిస్తాడు అంటూ తన అభిమానులు కూడా విపరీతమైన ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటున్నారు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.అయితే సందీప్ ఈ సినిమాలో రష్మిక మందన ను కానీ లేదంటే అలియా భట్ ను కానీ తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే రష్మిక తో అనిమల్ సినిమా చేశాడు కాబట్టి ఆమెని మళ్లీ రిపీట్ చేయాలని చూస్తున్నాడు కానీ మరొక ఆలోచన ప్రకారం అలియాభట్( Alia Bhatt ) ను తీసుకుంటే సినిమాకి బాగా హెల్ప్ అవుతుందని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది.
మరి వీళ్ళిద్దరిలో ఎవరిని తీసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది…
.