మీ అభిమాన మొబైల్స్ కంపెనీ Samsung తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లను మధ్యతరగతి ప్రజలు సైతం కొనుగోలు చేసుకొనేలా నో-కాస్ట్ EMI ఆఫర్ తీసుకొస్తోంది.తన ఫ్లాగ్‌షిప్ ఫోన్స్‌తో పాటు ఫోల్డబుల్ ఫోన్స్ కూడా అందరూ సొంతం చేసుకునేలా మరొక సూపర్ ఆప్షన్ తీసుకొచ్చిందని సమాచారం.
ఫ్లాగ్‌షిప్, ఫోల్డబుల్ శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేయాలనుకునేవారికోసం శామ్‌సంగ్ Buy Now, Pay Later అనే ఆప్షన్ తీసుకొచ్చింది.ఈ కొత్త ఆప్షన్ Galaxy S22 series, Galaxy Z Fold3, Galaxy Z Flip3 కొనుగోళ్లకు వర్తిస్తుంది.
అయితే ఈ ఆఫర్ కేవలం ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లకు మాత్రమే అందుబాటులో వుంది.
కొనవలసినవారు దేశ వ్యాప్తంగా ఉన్న శామ్‌సంగ్ రిటైల్ స్టోర్లలో ఈ ఆఫర్ పొందవచ్చు.
ఈ ఆఫర్ కింద పైన పేర్కొన్న స్మార్ట్‌ఫోన్ల మొత్తం ధరలో 60% వరకు 18 EMI పద్ధతిలో చెల్లించవలసి ఉంటుంది.మిగిలిన 40 శాతం మొత్తాన్ని 19వ EMIలో బుల్లెట్ పేమెంట్‌గా చెల్లించాలి.కనీసం రూ.1.5 లక్షల క్రెడిట్ లిమిట్ ఉన్న కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్‌కు వర్తిస్తుందని చెప్పడం ఇక్కడ కొసమెరుపు.శామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లపై జీరో డౌన్ పేమెంట్, 1% మినిమం ప్రాసెసింగ్ ఛార్జీని కూడా అందిస్తోంది.
కొన్ని నెలల క్రితం లాంచ్ అయిన గెలాక్సీ S22 సిరీస్ ఫోన్లు అద్భుతమైన ఫీచర్లతో మొబైల్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.వీటిలో ఒకటైన శామ్‌సంగ్ గెలాక్సీ S22 రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది.ఈ ఫోన్ 8GB RAM+256GB స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.76,999గా, 8+128GB వేరియంట్ ధరను రూ.72,999గా కంపెనీ నిర్ణయించింది.ఈ ఫోన్ ఫాంటమ్ బ్లాక్, ఫాంటమ్ వైట్, గ్రీన్ కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో వుంది.ఇక గెలాక్సీ S22+ 8GB RAM +128GB స్టోరేజ్ వేరియంట్ రూ.84,999 ధరతో లాంచ్ అయిన విషయం తెలిసినదే.