టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ముద్దుగుమ్మ సమంత ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా తెగ అవకాశాలు అందుకుంటోంది.
ఇక సమంత వ్యక్తిగత విషయం గురించి అందరికీ తెలిసిందే.నాలుగేళ్ల కిందట అక్కినేని వారసుడు నాగచైతన్యను పెళ్లి చేసుకొని మంచి జీవితంలోకి అడుగుపెట్టింది.
ఇక ఏమి జరిగిందో తెలియదు కానీ.గత ఏడాది తాము విడిపోతున్నామని సోషల్ మీడియా ద్వారా ప్రకటించించి అక్కినేని కుటుంబంకు, తెలుగు ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది.అప్పటినుంచి ఒంటరి జీవితాన్ని గడుపుతూ తన కెరీర్ తో బాగా బిజీగా మారింది.కానీ తను అక్కినేని కుటుంబంతో టచ్ లోనే ఉందని తెలిసింది.
పైగా ఇటీవలే తన మరిది అయినా అక్కినేని అఖిల్ బర్త్ డే సందర్భంగా తన సోషల్ మీడియా వేదికగా స్వీట్ మెసేజ్ పంపింది.
అందులో.హ్యాపీ బర్త్ డే.ఈ సంవత్సరం మీకు చాలా మంచి జరగాలని కోరుకుంటున్నాను.నువ్వు కోరుకున్నవన్నీ దక్కేలని దేవుడిని కోరుకుంటున్నాను అంటే అతడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.కానీ ఈ పోస్టుకు తన మరిది ఇంకా పట్టించుకోలేకపోవటంతో తెగ ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
తన మాజీ వదిన సమంత మీద తనకు కూడా కోపం ఉందేమో అని నెటిజన్లు నానారకాలుగా కామెంట్లు పెడుతున్నారు.