ఇటీవల టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో సీఎం కేసీఆర్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ పెట్టాలని ప్రతిపాదనలు వస్తున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు.దళిత బంధు పథకం అమలు తర్వాత మరింతగా.
ఏపీ నుండి స్పందన వస్తుందని.పార్టీ పెట్టాలని చాలా మంది కోరుతున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో కెసిఆర్ చేసిన వ్యాఖ్యలపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.
దేశంలో ఎవరు ఎక్కడ ఏ రాష్ట్రంలో అయినా పార్టీ పెట్టుకోవచ్చని ఎటువంటి అభ్యంతరాలు లేవని కేసిఆర్ వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు.
కేసీఆర్ వ్యాఖ్యలు పక్కన పెడితే ఆయన చేసిన వ్యాఖ్యలు తీసుకుని చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు.ఆయనే కదా అక్కడ తన్నితే చంద్రబాబు ఇక్కడికి వచ్చాడు.
మాటలో ఏముంది ఏదైనా మాట్లాడొచ్చు నేను కూడా పార్టీ పెట్టొచ్చు.అడగకుండానే పార్టీ పెట్టొచ్చు అంటూ సజ్జల తనదైన శైలిలో కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.ఇలా ఉంటే కెసిఆర్ ప్లీనరీ సమావేశంలో.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్ క్యాపిటల్ ఇన్ కం తెలంగాణ కంటే తక్కువ అని ఎద్దేవా చేశారు.తెలంగాణ రాష్ట్రం చీకట్లో కలిసిపోతుందని కొంతమంది ఏపీ నాయకులు అన్నారు.కానీ ఇప్పుడు ఏపి చీకటి లోకి వెళ్లిపోయిందని కేసీఆర్ సెటైర్లు వేశారు.