సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో దశాబ్దాల నుంచి హీరోల హవా కొనసాగుతుంది.అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం హీరోలతో సమానంగా విజయాలను అందుకోవడంతో పాటు రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.
అలా కొన్నేళ్ల క్రితం స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇచ్చి భారీ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న హీరోయిన్లలో విజయశాంతి కూడా ఒకరు.ప్రతి సంవత్సరం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ల జాబితాను పరిశీలిస్తే హీరోల సినిమాలు మాత్రమే ఉంటాయి.
కొన్ని సందర్భాలలో మాత్రమే ఈ జాబితాలో చిన్నచిన్న హీరోల సినిమాలు ఉంటాయి.అయితే హీరోయిన్ విజయశాంతి నటించిన రెండు సినిమాలు మాత్రం రెండు వేర్వేరు సంవత్సరాలలో ఆయా సంవత్సరాల బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.1985 సంవత్సరంలో టి.కృష్ణ డైరెక్షన్ లో విజయశాంతి మెయిన్ లీడ్ లో నటించి ప్రతిఘటన సినిమా రిలీజైంది.ఈ సినిమాకు నిర్మాత ప్రముఖ నిర్మాతలలో ఒకరైన రామోజీరావు కావడం గమనార్హం.
టి.కృష్ణ విజయశాంతి తప్ప ప్రతిఘటన సినిమాలోని పాత్రకు మరో హీరోయిన్ న్యాయం చేయలేరని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు.కేవలం 30 రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా ఈ సినిమా సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు.
ఈ సినిమా ద్వారా విజయశాంతికి అవార్డులు లభించగా ఈ సినిమాకు నాలుగు కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు వచ్చాయి.ఆ తర్వాత 1997 సంవత్సరంలో కూడా విజయశాంతి ఇదే రేర్ ఫీట్ ను సొంతం చేసుకున్నారు.
దళిత మహిళగా విజయశాంతి కీలక పాత్రలో నటించిన ఒసేయ్ రాములమ్మ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.దాసరి నారాయణరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో అద్భుతంగా నటించి విజయశాంతి తన పాత్రకు ప్రాణం పోశారని చెప్పవచ్చు.ఈ సినిమా 12.5 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించగా ఈ సినిమా బడ్జెట్ మాత్రం కేవలం 2 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.