సాహో అనిపించిన ప్రభాస్.. ఇక్కడ కాదు అక్కడ!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి చిత్రంతో ఇంటర్నేషనల్ గుర్తింపును ఏ విధంగా సాధించుకున్నాడో అందరికీ తెలిసిందే.ఈ సినిమా తరువాత ప్రభాస్ నటించిన సినిమా సాహో కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు.

 Saaho Stunning Bollywood Trp Rating, Saaho, Prabhas, Sujeeth, Shraddha Kapoor, T-TeluguStop.com

ఈ సినిమా టీజర్ మొదలుకొని ట్రైలర్ వరకు సినిమాపై అతిభారీ అంచనాలను క్రియేట్ చేసింది.ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటిస్తుండటం, భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించడంతో సాహోపై బాలీవుడ్ వర్గాలతో పాటు సౌత్‌లోనూ అతిభారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమా రిలీజ్ తరువాత సాధించిన ఫలితం గురించి అందరికీ తెలిసిందే.ఈ సినిమాకు పెద్దగా ఆదరణ లభించకపోవడం, సినిమాలో అంత మ్యాటర్ లేకపోవడంతో ఈ సినిమాను ఫ్యాన్స్ కూడా పట్టించుకోకపోవడంతో ఈ సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసింది.

కాగా ఈ సినిమాను ఇటీవల బాలీవుడ్‌లో టీవీలో ప్రసారం చేశారు.ఈ సినిమా 83.34 లక్షల ఇంప్రెషన్స్‌తో నెం.1 స్థానాన్ని దక్కించుకోవడం గమనార్హం.

కాగా పలు బాలీవుడ్ చిత్రాలను సైతం సాహో వెనక్కి నెట్టడంతో ప్రభాస్ ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో ఇట్టే అర్ధం అవుతోంది.ఇక ఈ సినిమాతో మరోసారి ప్రత్యేకమైన ఇమేజ్‌ను ప్రభాస్ సాధించడంతో ఆయన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కాగా ప్రస్తుతం జిల్ ఫేం రాధాకృష్ణ డైరెక్షన్‌లో తన 20వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న ప్రభాస్, అటుపై నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube