బాలయ్య కోసం పాత పచ్చడే అంటోన్న డైరెక్టర్

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రానికి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో ఈ సినిమా వస్తుండటంతో వీరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని అందరూ అనుకుంటున్నారు.

 B Gopal Old Story For Balakrishna, Balakrishna, B Gopal, Boyapati Srinu, Telugu-TeluguStop.com

అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తికాకముందే తన నెక్ట్స్ చిత్రాన్ని కూడా బాలయ్య లైన్‌లో పెట్టే పనిలో పడ్డాడు.

గతంలో బాలయ్యకు అదిరిపోయే హిట్లు అందించిన సీనియర్ డైరెక్టర్ బి.

గోపాల్‌తో మరో సినిమాకు బాలయ్య ఓకే చెప్పాడని తెలుస్తోంది.అయితే ఈసారి బాలయ్య కోసం గోపాల్ వెరైటీ కథను రెడీ చేశాడంటూ వార్తలు వినిపించాయి.

కానీ ఈ సినిమా కోసం ఆయన ఎంచుకున్న కథ చాలా రొటీన్ అని తెలుస్తోంది.ఈ సినిమాకు కథను సాయిమాధవ్ బుర్రా అందిస్తుండగా, ఇది చాలా రొటీన్ కథ అని తెలుస్తోంది.

ఈ సినిమాలో బాలయ్య 50 ఏళ్ల పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడని, తనకు ఓ కూతురు కూడా ఉంటుందని తెలుస్తోంది.

తండ్రి కూతుళ్ల మధ్య నడిచే కథను బి.గోపాల్ చూపించే విధానం ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని, ఈ కథకు బాలయ్య తప్ప మరే ఇతర హీరో కూడా న్యాయం చేయలేరని చిత్ర యూనిట్ భావిస్తోంది.ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే అంశాన్ని చిత్ర యూనిట్ ఇంకా ఫైనలైజ్ చేయలేరు.

మరి బాలయ్య ఈ సినిమాకు ఓకే చెబుతాడా లేడా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube