టమోటా ఆరోగ్యాన్నే కాదు జుట్టును పెంచుతుంది.. ఇంతకీ ఎలా వాడాలంటే?

మనం నిత్యం వంటల్లో విరివిరిగా వాడే కూరగాయల్లో టమోటా( Tomato ) ముందు వరుసలో ఉంటుంది.వంటలకు చక్కటి రుచిని అందించడంలో టమోటా ను కొట్టింది లేదు.

 Best Way To Use Tomato For Healthy And Thick Hair , Home Remedy, Latest News-TeluguStop.com

పైగా టమోటాలో పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది.అయితే ఆరోగ్యాన్ని మాత్రమే కాదు జుట్టును పెంచడానికి కూడా టమోటా అద్భుతంగా సహాయపడుతుంది.

సాధారణంగా చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడానికి చాలా మంది టమోటాల‌ను వాడుతుంటారు.అలాగే జుట్టుకు కూడా టమోటాలు ఉపయోగించవచ్చు.

టమోటాలో మెండుగా ఉండే విటమిన్ ఎ విటమిన్ సి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.స్కాల్ప్ ను తేమగా హెల్తీ గా మారుస్తాయి.

కురులను దృఢపరుస్తాయి.మరి ఇంతకీ జుట్టుకు టమోటాను ఎలా ఉపయోగించాలి అన్నది తెలుసుకుందాం పదండి.

ముందుగా బాగా పండిన ఒక టమోటా తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

Telugu Care, Care Tips, Healthy, Remedy, Latest, Thick, Tomato Benefits, Tomato-

ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు వేసి మెత్తని ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ టమోటా ప్యూరీలో రెండు టేబుల్ స్పూన్లు పెరుగు, వన్ టేబుల్ స్పూన్ ఆముదం ( Castor Oil )వేసి బాగా మిక్స్ చేయాలి.ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

Telugu Care, Care Tips, Healthy, Remedy, Latest, Thick, Tomato Benefits, Tomato-

అరగంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే జుట్టు ఎంత తీవ్రంగా రాలుతున్న క్రమంగా కంట్రోల్ అవుతుంది.హెయిర్ గ్రోత్ రెట్టింపు అవుతుంది.కురులు ఒత్తుగా మారతాయి.అలాగే చుండ్రు సమస్య( Dandruff problem ) ఉంటే దూరం అవుతుంది.స్కాల్ప్ హెల్తీగా హైడ్రేటెడ్ గా మారుతుంది.

కాబ‌ట్టి, ఆరోగ్యమైన ఒత్తైన కురుల కోసం తప్పకుండా ఈ టమోటా హెయిర్ మాస్క్ ను ట్రై చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube