చంద్రయాన్‌ 2 వెతికేందుకు రష్యా, అమెరికా సాయం

ప్రపంచ వ్యాప్తంగా అంతరిక్ష పరిశోదకుల దృష్టిని ఆకర్షించిన చంద్రయాన్‌ 2 చివరి నిమిషంలో విఫలం అయిన విషయం తెల్సిందే.ల్యాండర్‌ విక్రమ్‌ నుండి సిగ్నల్‌ అందక పోవడంతో ఈ ప్రయోగం ఆగిపోయింది.

 Russiaand Americahelp In Chandrayan 2-TeluguStop.com

అయితే మళ్లీ ఆ ల్యాండర్‌ నుండి సిగ్నల్‌ అందే అవకాశాలు ఉన్నాయనే ఆశ ఇస్రోలో కనిపిస్తుంది.అందుకోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఇస్రో చైర్మన్‌ శివన్‌ స్వయంగా ప్రకటించారు.14 రోజుల పాటు ల్యాండర్‌ కోసం వెదకనున్నట్లుగా ఆయన పేర్కొన్నారు.ఇక చంద్రయాన్‌ను వెదికేందుకు, దాని నుండి సిగ్నల్స్‌ను రాబట్టేందుకు రష్యా లేదా అమెరికా సాయంను తీసుకునేందుకు కూడా చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

</br>

ఆ దేశాలకు సంబంధించిన సాయంతో చంద్రయాన్‌ 2ను మళ్లీ ఆధీనంలోకి తీసుకు వచ్చే అవకాశం ఉంటే తప్పకుండా సాయం తీసుకోవాలని అంతా కోరుకుంటున్నారు.ఈ విషయమై కేంద్రం నుండి కూడా ఇస్రో ఒక అనుమతి అనేది తీసుకోవాల్సి ఉంది.

మొదట కేంద్రంతో చర్చలు జరిపి ఆ తర్వాత అమెరికా మరియు రష్యాలతో చర్చలు జరుపనున్నాయి.ఒకవేళ ఇస్రో సాయం అడిగితే చేయందుకు సిద్దంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.అంతర్జాతీయ మీడియాలో ఈ విషయమై చర్చ జరుగుతోంది.మరి ఇస్రో ఈ విషయమై ఎలాంటి అడుగు తీసుకుంటుంది అనేది చూడాలి.

ఒకవేళ వారి సాయం తీసుకున్నా కూడా ప్రయోగం సఫలం అవ్వదు అనుకుంటే వారిని అడగక పోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube