అవును.అమెరికాకు భారత్ పైన కాలుతున్న వేళ రష్యా మరో బంపర్ ఆఫర్ ప్రకటించడం విశేషం.
యుక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాపై గుర్రుగా ఉన్నా అమెరికా, మనమీద కూడా ఓ కన్నేసింది.ఈ క్రమంలో ఇతర నాటో దేశాలు చమురుపై పూర్తిస్థాయిలో నిషేధం విధించిన సంగతి తెలిసినదే.
దీంతో గడచిన నెల రోజుల్లో రష్యా చమురును కొనుగోలు చేసేవారి సంఖ్య గణనీయంగా పడిపోయింది.అందువలన చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
ఇక ఈ నిషేధం పుణ్యమా అని బ్యారెల్ క్రూడాయిల్ ధర 139 డాలర్లకు చేరడం విశేషం.దీంతో పాటు రష్యా వద్ద చమురు నిల్వలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి.
ఇదివరకు రష్యా అమెరికాకు ప్రతి రోజు 7 లక్షల బ్యారెళ్ల చమురును ఎగుమతి చేసేది.అంతేగాకుండా ప్రపంచ చమురు అవసరాల్లో 12 శాతం.సహజ వాయువులో 16 శాతం అవసరాలను రష్యా తీరుస్తుందనేది నగ్న సత్యం.ఇప్పుడీ చమురును కొనేవారు లేకపోవడంతో.
ఆ చమురును భారత్‌కు అతి తక్కువ ధరకే విక్రయిస్తామంటూ రష్యా చమురు కంపెనీలు ఇప్పటికే భారత్‌కు ఆఫర్ చేశాయి.ఇప్పుడు మరోసారి నేరుగా నొవాక్ ఫోన్ చేయడంతో ఈ విషయంలో రష్యా చాలా సీరియస్‌గా ఉన్నట్టు క్లియర్ కట్‌గా తెలుస్తోంది.

ఇకపోతే ఈ ఆయిల్ దిగుమతి విషయంలో భారత్ పైన అమెరికా గుర్రుగా ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.వివిధ దేశాలు రష్యా ఆయిల్ ని నిషేదిస్తున్నవేళ భారత్ కొనడం పైన పెద్దన్న మంచి కోపంగా ఉన్నట్టు సమాచారం.ఇక రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే అమెరికా, యూరోపియన్ దేశాలకు భారత్ వ్యతిరేకంగా అడుగులు వేసినట్టే అని అమెరికా ఆరోపిస్తోంది.మరోసారి ఇలాంటి పరిస్థితుల్లో ఈ విధమైన సాహసోపేతమైన నిర్ణయం భారత్ తీసుకుంటుందా? లేదా అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా ఉంది.