మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) ఆచార్య సినిమా తర్వాత గాడ్ ఫాదర్ మరియు వాల్తేరు వీరయ్య సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.గాడ్ ఫాదర్( Godfather ) పర్వాలేదు అన్నట్లుగా నిలిచింది.
వాల్తేరు వీరయ్య మాత్రం భారీ వసూళ్లు నమోదు చేసుకుంది.చిరంజీవి స్థాయి ఏమాత్రం తగ్గలేదు అంటూ వాల్తేరు వీరయ్య సినిమా నిరూపించింది.
అప్పటి నుండి ఇప్పటి వరకు చిరంజీవి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు అంటూ వాల్తేరు వీరయ్య సినిమా నిరూపించింది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా వర్గాల వారు కూడా మాట్లాడుకున్నారు.అలాంటి వాల్తేరు వీరయ్య సినిమా తర్వాత వచ్చిన సినిమా భోళా శంకర్.
తమిళ్ హిట్ మూవీ వేదాళం కు రీమేక్.
చాలా సంవత్సరాల క్రితం ఈ సినిమా రీమేక్ ను పవన్ చేయాలి అనుకున్నాడు.ప్రారంభం కూడా అయింది.కానీ కొన్ని కారణాల వల్ల వేదాళం రీమేక్( Vedalam Remake ) ను పవన్ చేయలేదు.
ఆ రీమేక్ ను చిరంజీవి చేయడం జరిగింది.కమర్షియల్ ఎలిమెంట్స్ విషయం లో దృష్టి పెట్టడం వల్ల సినిమా ఫలితం తారు మారు అయింది అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు.
ఆ విషయం పక్కన పెడితే భోళా శంకర్ సినిమా వల్ల నిర్మాత భారీ గా నష్టపోయాడు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.నిర్మాత అనిల్ సుంకర( Producer Anil Sunkara ) ఎంత నష్టపోయాడు అనే విషయం లో క్లారిటీ రావడం లేదు.
కానీ ఈ మధ్య కాలంలో ఒక స్టార్ హీరో తో సినిమా ను నిర్మిస్తే నష్టపోయే పరిస్థితి లేదు.
ఎందుకంటే విడుదలకు ముందే బిజినెస్ అవుతుంది.ఆ తర్వాత నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా కూడా భారీ మొత్తంలో ఆదాయం వస్తుంది.కనుక ఎలాంటి డౌట్ లేకుండా భోళా శంకర్ సినిమా( Bhola Shankar ) కాస్త అటు ఇటుగా నిర్మాత అనిల్ సుంకర పెట్టిన మొత్తం ను వెనక్కి తెచ్చి ఉంటుంది అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.
అసలు విషయం ఏంటి అనేది నిర్మాత అనిల్ సుంకర మాట్లాడితే కాని క్లారిటీ వచ్చే అవకాశం లేదు.