ఆర్ఆర్ఆర్ దెబ్బకు మల్టీస్టారర్లు ఆగిపోయినట్టే.. జక్కన్ననే నిందించడంతో?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు ఒకే రేంజ్ ఉన్న స్టార్ హీరోలతో మల్టీస్టారర్ సినిమాలను తెరకెక్కించడానికి సిద్ధంగానే ఉన్నారు.అయితే హీరోలు ఐకమత్యంతోనే ఉన్నా స్టార్ హీరోల అభిమానులు మాత్రం ఐకమత్యంతో మెలగడం లేదు.

 Rrr Movie Effect On Multistarrer Movies Details Here Goes Viral , Interesting F-TeluguStop.com

చరణ్, తారక్ రియల్ లైఫ్ లో కూడా మంచి స్నేహితులు అనే సంగతి తెలిసిందే.ఆ స్నేహం వల్లే వీళ్లిద్దరూ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ అంచనాలకు మించి విజయాన్ని అందుకుంది.

అయితే ఆర్ఆర్ఆర్ సక్సెస్ సాధించినా అటు చరణ్, ఇటు తారక్ ఫ్యాన్స్ నుంచి వ్యక్తమవుతున్న కామెంట్ల వల్ల పూర్తిస్థాయిలో ఆర్ఆర్ఆర్ సక్సెస్ ను ఆస్వాదించలేకపోతున్నారు.ఎన్టీఆర్ అభిమానులు సినిమాలో తమ ఫేవరెట్ హీరో పాత్రకు ఒకింత అన్యాయం జరిగిందని జక్కన్ననే నిందించడం గమనార్హం.

భవిష్యత్తులో స్టార్ హీరోలు మల్టీస్టారర్లు చేయాలన్నా ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో వచ్చిన కామెంట్లను దృష్టిలో ఉంచుకుని ఆగిపోయే ఛాన్స్ అయితే ఉంది.

Telugu Charan, Journalist, Multirers, Rajamouli, Rrr, Tarak-Movie

జర్నలిస్ట్ లు సైతం ఈవెంట్లలో సినిమాలో ఒక హీరో డామినేషన్ ఎక్కువగా ఉందని చెబుతూ అడుగుతున్న ప్రశ్నలు మేకర్స్ కు తలనొప్పిగా మారాయి.చరణ్, తారక్ ఇప్పటికే స్క్రీన్ స్పేస్ విషయంలో తమకు ఎలాంటి బాధ లేదని ఒకరి పాత్ర విషయంలో మరొకరు హ్యాపీగానే ఉన్నామని చెప్పుకొచ్చారు.హీరోలే స్వయంగా వివరణ ఇచ్చినా వార్తలు మాత్రం ఆగడం లేదు.

ఒకే రేంజ్ ఉన్న స్టార్ హీరోలు ఇకపై మల్టీస్టారర్లలో నటించడానికి ఆసక్తి చూపుతారో లేదో చూడాల్సి ఉంది.

ఆర్ఆర్ఆర్ సినిమాకు కూడా రాజమౌళి డైరెక్టర్ కావడం వల్లే చరణ్, తారక్ ఈ సినిమాలో నటించడానికి అంగీకరించారనే సంగతి తెలిసిందే.

రాజమౌళి సైతం ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో వ్యక్తమైన నెగిటివ్ కామెంట్ల వల్ల భవిష్యత్తులో మల్టీస్టారర్ సినిమాలకు దూరంగా ఉండే అవకాశం అయితే ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube