రౌడీ హీరో విజయ్ దేవరకొండ ( Vijay deverakonda ) కు ప్రస్తుతం యూత్ లో ఎలాంటి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎంతోమంది స్టార్ హీరోయిన్లు ఈయనతో డేటింగ్ చేయాలని ఆసక్తిగా ఎదురు చూస్తూ వారి బోల్డ్ ఫీలింగ్స్ ని బయట పెడుతున్నారు.
ఇక విజయ్ దేవరకొండ నటించిన లైగర్ ( Liger ) సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై అట్టర్ ప్లాఫ్ అయిన సంగతి మనకు తెలిసిందే.అంతేకాదు ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో విజయ్ దేవరకొండ టేబుల్ పై కాళ్లు పెట్టి కూర్చోవడం ఎలా ఎన్నో ఎక్స్ట్రాలు చేసి ట్రోల్స్ కి గురయ్యారు.
అలాంటి విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి, గీతగోవిందం, పెళ్లి చూపులు, డియర్ కామ్రేడ్ వంటి లవ్ రొమాంటిక్ సినిమాలతో హిట్ కొట్టారు.
కానీ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా తర్వాత మళ్లీ లవ్ స్టోరీస్ లో నటించను అని స్టేజ్ పై గట్టిగా చెప్పారు.
కానీ ఖుషి ( Khushi ) సినిమా కథ నచ్చడంతో మళ్ళీ ప్రేమ కథా సినిమాని చేశారు.ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యి సెప్టెంబర్ 1న థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సినిమాలో సమంత విజయ్ దేవరకొండ మధ్య ఒక అద్భుతమైన ప్రేమకావ్యం ఉండబోతుంది అని తెలుస్తుంది.
అలాగే ఈ సినిమా చూడడానికి విజయ్ దేవరకొండ, సమంత ( Samantha ) అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఇదంతా పక్కన పెడితే తాజాగా విజయ్ దేవరకొండ ఓ డ్యాన్స్ ప్రోగ్రాం ఫైనల్లో పాల్గొని సందడి చేశారు.ఇక ఈ డ్యాన్స్ షోలో యాంకర్ మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడగగా.
నన్ను ఇంట్లో వాళ్ళు,బంధువులు అందరూ పెళ్లి గురించి అడుగుతున్నారు.అన్నీ వింటున్నాను.
అలాగే మా తల్లిదండ్రులు కూడా నాకు పుట్టే పిల్లలను ఎత్తుకొని ఆడించాలని ఆతృతగా ఉన్నామని చెబుతున్నారు.దాంతో వారి మాటలు విని విసిగిపోయి ఓ పని చేయండి మీకే మళ్ళీ పెళ్లి చేస్తా.మీరే మళ్ళీ పిల్లల్ని కనండి అంటూ వారికి చెబుతున్నాను అని విజయ్ దేవరకొండ ఫన్నీ కామెంట్స్ చేశారు.ప్రస్తుతం విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.