తమిళంలో తెరకెక్కి సూపర్ డూపర్ సక్సెస్ అయిన ‘రోబో’ చిత్రంకు ప్రస్తుతం సీక్వెల్ చేసే పనిలో దర్శకుడు శంకర్ ఉన్న విషయం తెల్సిందే.గత కొంత కాలంగా ‘రోబో’ సీక్వెల్ ‘రోబో 2’ అంటూ ప్రచారం జరుగుతూ వచ్చింది.
దర్శకుడు శంకర్ తాజాగా సీక్వెల్ టైటిల్ ‘రోబో 2’ కాదని క్లారిటీ ఇచ్చాడు.‘రోబో’కు సీక్వెల్ చేస్తున్నంత మాత్రాన ‘రోబో 2’ అనాల్సిన పని లేదని, ఈ చిత్రం కథకు అనుగుణంగా ఒక మంచి టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు.
వచ్చే సంవత్సరం జనవరిలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన శంకర్ ప్రస్తుతం నటీ నటుల ఎంపిక చేశాడు.
ఈ చిత్రాన్ని రెండు గంటల్లోనే పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నాడు.హాలీవుడ్ స్టాండర్డ్స్‌కు తగ్గట్లుగా ఈ చిత్రం ఉంటుందని, హాలీవుడ్ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ ఈ చిత్రం చేస్తున్నట్లుగా శంకర్ చెబుతున్నాడు.
హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు.రజినీకాంత్ సరసన హీరోయిన్ ఎవరు అనేది ప్రస్తుతానికి తెలియరాలేదు.