రిషి సునాక్ బ్రిటన్‌ ప్రధాని కాకుండా కుట్ర...?

బ్రిటన్‌ ప్రధాని పదవి రేసులో మొదటిస్థానంలో నిలిచిన మాజీ ఆర్థికమంత్రి రిషిసునాక్‌ను ఓటమిపాలు చేయడానికి కుట్ర జరుగుతున్నట్టు తెలుస్తోంది.తాత్కాలిక ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ వర్గం తమ పార్టీలో అంతర్గతంగా సునాక్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్టు తెలుస్తోంది.

 Rishi Sunak Is Not British Prime Minister But A Conspiracy Rishi Sunak, Britain-TeluguStop.com

సునాక్‌ను తప్ప ఇంకెవరినైనా బలపరచాలని తన వర్గం ఎంపీలకు జాన్సన్‌ సూచించినట్టు తెలుస్తోంది.తాను పలు వివాదాల్లో చిక్కుకోవడంతో అధికార కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన జాన్సన్‌ ఈనెల 7న ప్రధాని పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

సునాక్‌ తనకు ద్రోహం చేసినందునే సొంత పార్టీ నేతలు తనకు దూరమయ్యారని బోరిస్‌ ఆగ్రహంతో ఊగిపోతున్నట్టు తెలుస్తోంది.తదుపరి ప్రధానిగా ఎవరు ఉండాలన్న విషయంలో తలదూర్చబోనని అంటూనే సునాక్‌ ప్రధాని పదవి చేపట్టకుండా జాన్సన్ పావులు కదుపుతున్నారని చెబుతున్నారు.

సునాక్‌ను కాకుండా బరిలో ఉన్న ఏ అభ్యర్థినైనా బలపరచాలని జాన్సన్‌ చెబుతున్నట్టు తెలుస్తోంది.సునాక్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రధాని కాకూడదంటూ తన మద్దతుదారులతో ఆయన మంతనాలు సాగిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలొచ్చాయి.

విదేశాంగమంత్రి లిజ్‌ట్రస్‌ లేదంటే కార్మికమంత్రి పెన్నీమోర్డాంట్‌.ఇంకా ఇతర పోటీదారులైన జాకబ్‌ రీస్‌,నదీనే డోరిస్‌లలో ఎవరో ఒకరికి మద్దతివ్వాలని జాన్సన్ సూచించినట్టు తెలుస్తోంది.

Telugu Boris Johnson, Britain, International, Jacob Rees, Lisztrus, Nadine Doris

తనను పదవి నుంచి తప్పించేందుకు సునాక్‌ కొన్ని నెలలుగా ప్రయత్నాలు చేసినట్టు బోరిస్‌ జాన్సన్ భావిస్తున్నట్టు మీడియా కథనాల్లో పేర్కొన్నారు.ఈ వార్తలు బయటకు వెల్లడైన తర్వాత జాన్సన్ వర్గం దిద్దుబాటు చర్యలు చేపడుతున్నట్టుగా కనిపిస్తోంది.సునాక్‌ను ఓడించాలని బోరిస్‌ ప్రచారం చేస్తున్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన సన్నిహితుడొకరు వ్యాఖ్యానించారు.అయితే, సునాక్ తనకు ద్రోహం చేశారన్న బాధ మాత్రం జాన్సన్ కు ఉన్నదని ఆయన సన్నిహితుడు పేర్కొన్నారు.

తన మంత్రివర్గం నుంచి సునాక్ ఆర్థికమంత్రిగా వైదొలిగిన తర్వాతే, మిగతా మంత్రులు రాజీనామాలు చేయడంతో జాన్సన్ పై ఒత్తిడి పెరిగి ప్రధాని పదవికి రాజీనామా చేశారన్నది గమనార్హం…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube