సినీ స్టార్స్ మరియు రాజకీయ నాయకులుకు, వ్యాపారస్తులకు తమ ఇళ్లతో పాటు సిటీ ఔట్ స్కట్స్‌లో పెద్ద పెద్ద గెస్ట్ హౌస్‌లు ఉంటాయనే విషయం తెల్సిందే.ప్రభాస్‌కు కూడా హైదరాబాద్ శివారు ప్రాంతంలోని శేరిలింగంపల్లి రెవిన్యూ డెవిజన్‌లో ఒక గెస్ట్ హౌస్ ఉంది.
అయితే ప్రభాస్ గెస్ట్ హౌస్ ఉన్న ఆ స్థలం గురించి చాలా ఏళ్లుగా కోర్టులో కేసు నడుస్తోంది.ప్రభుత్వంకు చెందిన భూమిని కొందరు ఆక్రమించి వెంచర్లు చేసి, దాన్ని అమ్మేందుకు చూశారని కోర్టులో పిటీషన్ దాఖలు అయ్యింది.

సుదీర్ఘ కాలం విచారణ సాగిన ఈ కేసు విషయం ఎట్టకేలకు పరిష్కారం అయ్యింది.సుప్రీం కోర్టు ఆ 85 ఎకరాల భూమి ప్రభుత్వంకు చెందుతుందని తీర్పు వచ్చింది.ఆ 85 ఎకరాల్లోనే ప్రభాస్ గెస్ట్ హౌస్ కూడా ఉంది.దాంతో శేరిలింగంపల్లి రెవిన్యూ ఆఫీసర్ ప్రభాస్ ఇంటికి తాళం వేసి, సీజ్ చేయడం జరిగింది.ఆ ఇల్లు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం హయాంలోకి వచ్చినట్లుగా అధికారులు చెబుతున్నారు.

ప్రభాస్ ఎంతో ఇష్టపడి, ముచ్చటపడి ఆ ఫామ్ హౌస్‌ను ఏర్పాటు చేసుకున్నాడట.నెలలో కనీసం రెండు మూడు సార్లు అయినా ప్రభాస్ వస్తాడట.ప్రభాస్ తన స్నేహితులతో ఎక్కువగా ఇక్కడకు వచ్చేవాడని స్థానికులు చెబుతున్నారు.
తన గెస్ట్ హౌస్‌ను 2200 చదరపు గజాల్లో ప్రభాస్ నిర్మించుకున్నాడు.ఈ విషయమై ప్రభాస్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.