రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై 6 భాషల్లో రిపోర్టింగ్ చేస్తూ అద‌ర‌గొడుతున్న‌ జ‌ర్న‌లిస్టు

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ రూపం దాల్చేలా కొన‌సాగుతోంది.దీంతో ప్ర‌పంచంలోని అందరి చూపు ఆ రెండు దేశాలపైనే ఉంది.

 Reporter Covering The Russia Ukraine Conflict In Six Languages Details, Reporter-TeluguStop.com

ప్రపంచ వ్యాప్తంగా అగ్ర‌దేశాల నేత‌లు మొద‌లుకొని సామాన్య‌ ప్రజలు సైతం ఈ సంక్షోభాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు.ఇదే స‌మ‌యంలో ఒక రిపోర్ట‌ర్‌కి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

రిపోర్టర్ ఉక్రెయిన్‌లో ఉంటూ అక్కడి నుండి రిపోర్టింగ్ చేస్తున్నారు.ఆశ్చర్యకరమైన విషయ మేమిటంటే.

ఈ రిపోర్టర్ ఒక్కరే ఆరు భాషల్లో రిపోర్టింగ్ చేస్తూ అంత‌కంత‌కూ అక్క‌డ దిగ జారుతున్న పరిస్థితుల గురించి చెబుతున్నారు.

దీంతో ఈ రిపోర్టర్ పై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

ఈ రిపోర్టర్ పేరు ఫిలిప్ క్రౌథర్. ఫిలిప్ అసోసియేటెడ్ ప్రెస్ గ్లోబల్ మీడియా సర్వీసెస్‌లో ప‌ని చేస్తున్నారు.

ఫిలిప్ ప్రస్తుతం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఉన్నారు.అతను అక్కడ నుండి ప‌లు మీడియా సంస్థ‌ల‌కు త‌న‌ సేవలను అంది స్తున్నారు.గమనించదగిన‌ విషయం ఏమిటంటే.ఈ రిపోర్ట‌ర్ ఫిలిప్ ఆరు వేర్వేరు భాషలలో అద్భుతమైన రిపోర్టింగ్ చేస్తూ క‌నిపిస్తున్నారు.అలాంటి అద్భుతమైన నైపుణ్యాలు ఉన్న రిపోర్టర్ హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్నారు.

డైలీమెయిల్ తెలిపిన వివ‌రాల ప్రకారం ఫిలిప్ క్రౌథర్ ఇంగ్లీష్, లక్సెంబర్గిష్, స్పానిష్, పోర్చుగీస్, ఫ్రెంచ్, జర్మన్ మొద‌లైన‌ ఆరు భాషలను అత్యంత సుల‌భంగా మాట్లాడుతున్నారు.తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ఫిలిప్ క్రౌథర్ త‌న ఆరు భాషల రిపోర్టింగ్ వీడియోను షేర్ చేశారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఈ వీడియోను చూసిన‌వారంతా అత‌ని ప్ర‌తిభ‌ను మెచ్చుకోకుండా ఉండ‌లేక‌ పోతున్నారు.

Reporter Covering The Russia Ukraine Conflict In Six Languages Details

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube