తీగ జాతి కూరగాయలలో చిక్కుడు( Beans ) కూడా ఒకటి.చిక్కుడులో చాలా రకాలు అందుబాటులోకి రావడం వల్ల ఏడాది పొడవునా చిక్కుడును సాగు చేయవచ్చు.
కొత్తరకం ఎర్ర చిక్కుడు( Red Broad Beans )ను సాగుచేస్తూ కొంతమంది అధిక దిగుబడులు సాధించి ఆదర్శంగా నిలుస్తున్నారు.ఎర్ర చిక్కుడు పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.
చిక్కుడు పంటను రెండు విధాలుగా సాగు చేస్తారు.ఒకటి పందిరి రూపంలో రెండు పొద చిక్కుడు రూపంలో సాగు చేస్తారు.
పందిరి విధానంలో సాగు చేయాలంటే కాస్త అధిక ఖర్చు చేయాల్సి ఉంటుంది.అయితే పందిర్లు అవసరంలేని పాదు చిక్కుడు సాగు చేస్తే పెట్టుబడి వ్యయం తగ్గడం దిగుబడి పెరగడం జరుగుతుంది.

పైగా ఎర్ర చిక్కుడులో అన్ని పోషకాలు పుష్కలంగా ఉంటాయి.కాబట్టి మార్కెట్లో ఈ పడ్డకు ఎప్పుడు మంచి డిమాండే ఉంటుంది.ఈ ఎర్ర చిక్కుడు పంట నాటిన 50 రోజుల నుండి దిగుబడి రావడం ప్రారంభం అవుతుంది.వేసవికాలంలో నేలను లోతు దుక్కులు దున్నుకొని, పొలంలో ఇతర పంటలకు సంబంధించిన అవశేషాలు ఏమైనా ఉంటే పూర్తిగా తొలగించాలి.
ఒక ఎకరం పొలంలో సుమారుగా 5 నుంచి 6 టన్నుల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి.ఆ తర్వాత తెగులు నిరోధక మేలు రకం ఎర్ర చిక్కుడు విత్తనాలను ఎంపిక చేసుకొని సాగు చేపట్టాలి.
మొక్కల మధ్య, మొక్కల వరుసల మధ్య సూర్యరశ్మితో పాటు గాలి బాగా వీల్చే విధంగా కాస్త అధిక దూరంలో నాటుకోవాలి.ఎర్ర చిక్కుడు పంట 45 రోజులకు పూతకు వస్తుంది.50 రోజుల తర్వాత దిగుబడి రావడం ప్రారంభమవుతుంది.ఒక ఎకరం పొలంలో దాదాపుగా రూ.1 లక్ష ఆదాయం పొందవచ్చు.

ఈ ఎర్ర చిక్కుడు పంటకు బూజు తెగుళ్లు( Powdery mildew ), మచ్చ తెగుళ్లు ఆశించి తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉంది.పొలాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటూ ఈ తెగుల లక్షణాలు ఏవైనా కనిపిస్తే వెంటనే వ్యవసాయ క్షేత్ర నిపుణుల సలహా ప్రకారం రసాయన పిచికారి మందులను ఉపయోగించి తొలిదశలోనే వీటిని అరికడితే అధిక దిగుబడి పొందవచ్చు.