చిత్తూరు జిల్లా( Chittoor District ) ఐదుగురు చేతుల్లో ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) అన్నారు.ఈ క్రమంలోనే తనకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి మీద శతృత్వం లేదని చెప్పారు.
రాయలసీమ( Rayalaseema ) కొందరి చేతుల్లో బందీ అయిందనే బాధ తనకుందని తెలిపారు.రాయలసీమలో బలం ఉన్నోడిదే రాజ్యం అన్నట్లుగా పరిస్థితి ఉందని విమర్శించారు.
కర్నూలు జిల్లాలో సుగాలి ప్రీతి హత్య కేసు తనను కలిచివేసిందని జనసేనాని పేర్కొన్నారు.జనసేన( Janasena ) పోరాటం వలనే సుగాలి ప్రీతి కేసు సీబీఐకి అప్పగించారని తెలిపారు.సుగాలి ప్రీతి, కొట్టే సాయి వంటి వారి కోసమే రాజకీయాల్లో కొనసాగుతున్నానని వెల్లడించారు.తిరుమలలో అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.