Pawan Kalyan : రాయలసీమ కొందరి చేతుల్లో బందీ..: పవన్ కల్యాణ్
TeluguStop.com
చిత్తూరు జిల్లా( Chittoor District ) ఐదుగురు చేతుల్లో ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) అన్నారు.
ఈ క్రమంలోనే తనకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి మీద శతృత్వం లేదని చెప్పారు.
రాయలసీమ( Rayalaseema ) కొందరి చేతుల్లో బందీ అయిందనే బాధ తనకుందని తెలిపారు.
రాయలసీమలో బలం ఉన్నోడిదే రాజ్యం అన్నట్లుగా పరిస్థితి ఉందని విమర్శించారు. """/" /
కర్నూలు జిల్లాలో సుగాలి ప్రీతి హత్య కేసు తనను కలిచివేసిందని జనసేనాని పేర్కొన్నారు.
జనసేన( Janasena ) పోరాటం వలనే సుగాలి ప్రీతి కేసు సీబీఐకి అప్పగించారని తెలిపారు.
సుగాలి ప్రీతి, కొట్టే సాయి వంటి వారి కోసమే రాజకీయాల్లో కొనసాగుతున్నానని వెల్లడించారు.
తిరుమలలో అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.
బన్నీ అరెస్ట్ దేనికి సంకేతం.. సెలబ్రిటీలు జాగ్రత్తగా ఉండకపోతే చుక్కలే!