రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' ప్రివ్యూ

రవితేజ హీరోగా శరత్‌ మండవ దర్శకత్వంలో రూపొందిన రామా రావు ఆన్ డ్యూటీ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకున్నప్పటి నుండి కూడా భారీ ఎత్తున ప్రమోషన్స్ చేస్తున్నారు.సినిమా ను ఇంతకు ముందే విడుదల చేయాల్సి ఉన్నా కూడా బిజినెస్ సరిగా అవ్వలేదు అంటూ వాయిదా వేశారని పుకార్లు షికార్లు చేశాయి.

 Ravi Teja Sharath Manda Rama Rao On Duty Film Preview Rama Rao On Duty , Prev-TeluguStop.com

ఆ సమయంలో విడుదల వాయిదా కు కారణం ఏంటీ అనే విషయాన్ని పక్కకు పెడితే ఆలస్యం అయిన కారణంగా మంచి పబ్లిసిటీ అయితే దక్కింది.హీరోయిన్స్ తో పాటు హీరో పాత్ర విషయం లో దర్శకుడు శరత్‌ మండవ వివరించిన తీరు సినిమా పై అంచనాలు.

ఆసక్తి పెంచే విధంగా ఉన్నాయంటూ కామెంట్స్ వస్తున్నాయి.సోషల్‌ మీడియా లో రామా రావు ఆన్‌ డ్యూటీ సినిమా కు చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు.

అందుకే ఈ సినిమా కు మంచి ఓపెనింగ్స్ వస్తాయనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు.రవితేజ మొదటి సారి ఒక గవర్నమెంట్‌ రెవిన్యూ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు.

ఇప్పటి వరకు పోలీసుగా కనిపించాడు కాని ఇతర ప్రభుత్వ అధికారి గా మాత్రం కనిపించలేదు.రెవిన్యూ ఆఫీస్‌ ల్లో జరిగే తంతు ను ఈ సినిమా లో చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

రవితేజ మరియు శరత్‌ మండవ లు సినిమా పై చాలా నమ్మకం తో ఉన్నారు.రవితేజ ఈ సినిమా కు చాలా కష్టపడటంతో పాటు చాలా ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది.

హీరో గా నటించడం తో పాటు ఈ సినిమా కు నిర్మాతగా కూడా వ్యవహరించిన కారణంగా ఆయన ఫ్యాన్స్ డబుల్ ఆసక్తి తో ఎదురు చూస్తున్నారు.రవి తేజ గత చిత్రం ఖిలాడీ ఫలితాన్ని పట్టించుకోకుండా ఈ సినిమాకు ఫ్యాన్స్‌ థియేటర్ల వద్ద క్యూ కడతారు అనే నమ్మకంతో చాలా మంది ఉన్నారు.

మరి ఫలితం ఏం అవుతుందో చూడాలి.రేపు విడుదల కాబోతున్న రామా రావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ కోసం చూస్తూనే ఉండండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube