సెలబ్రిటీస్ కి బిగ్ బాస్ రియాలిటీ షో( Bigg Boss Show ) ఒక పునర్జన్మ లాంటిది అని చెప్పొచ్చు.టాలెంట్ ఉండి సరైన అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న ఎంతో మంది సెలబ్రిటీస్ కి గొప్ప ప్లేట్ ఫార్మ్ ఇది.
ఇక్కడకి వచ్చిన తర్వాత కోట్లాది మంది తెలుగు ఆడియన్స్ కి మరింత చేరువ అవ్వడమే కాకుండా సినిమాల్లో బాగా బిజీ అయ్యి మరోసారి కెరీర్ ని రీ స్టార్ట్ చేసినట్టు ఉంటుంది.చాలా మంది కెరీర్స్ ఇలాగే సక్సెస్ అయ్యింది.
ఇప్పుడు బిగ్ బాస్ రతికా( Rathika Rose ) కెరీర్ కూడా అలాగే మారిపోయింది.ఈమె హౌస్ లో ఉన్నది కేవలం నాలుగు వారాలు మాత్రమే.
ఈ నాలుగు వారాల్లోనే ఆమె తన అందం తో కుర్రకారుల్ని కట్టిపారేసింది.ఇంత హాట్ గా ఉన్న అమ్మాయి ఎందుకు సినిమాల్లో హీరోయిన్ గా చెయ్యలేదు, ఎందుకు ఈమెకి అవకాశాలు ఇవ్వలేదు అని చాలా మంది అనుకున్నారు.
ఈటీవీ లో ప్రసారమయ్యే పటాస్ అనే స్టాండప్ కామెడీ షో ద్వారా ఈమె తొలిసారి ఆడియన్స్ కి పరిచయమైంది.అప్పట్లో ఈమె ప్రియాంక అనే పేరుతో పిలువబడింది.ఆ తర్వాత పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించే అవకాశం దక్కించుకున్న రతికా, కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా కూడా నటించింది.కానీ ఆశించిన స్థాయి గుర్తింపు రాలేదు.
కానీ కళ్యాణ్ రామ్ హర్ గా నటించిన ‘అమిగోస్'( Amigos ) చిత్రం లో ఒక హీరోయిన్ గా నటించి గుర్తింపుని తెచ్చుకున్న రతికా , రీసెంట్ గా బాలయ్య బాబు హీరో గా నటించిన ‘భగవంత్ కేసరి'( Bhagavanth Kesari ) చిత్రం లో కూడా రతికా చిన్న పాత్ర లో కనిపించింది.ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత ఆమెకి ఎన్నో అవకాశాలు వచ్చాయి.
కానీ ఈమె ఆచితూచి అడుగులు వేస్తుంది.
అందుతున్న లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈమెకి రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్'( Ustaad Bhagath Singh ) చిత్రం లో ఐటెం సాంగ్ చేసే ఛాన్స్ దక్కింది అట.నవంబర్ నెలలో డేట్స్ కావాలని డైరెక్టర్ హరీష్ శంకర్ అడిగాడట.కానీ ఆమెకి మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ దొరికింది.
అందుకే ఆమె ఈ ఆఫర్ ని వదులుకుంది అట.సినిమాల్లో వరుసగా అన్ని ఆఫర్స్ వస్తున్నా కూడా ఆమె మళ్ళీ బిగ్ బాస్ రీ ఎంట్రీ కోసం పక్కన పెడుతుంది.రీ ఎంట్రీ తర్వాత ఈమె ఆట ఎలా ఉండబోతుంది అనే దానిపై ఉత్కంఠ మొదలైంది, చూడాలి మరి ఈమె టాప్ 5 లోకి వస్తుందా లేదా అనేది.