పుష్ప శ్రీవల్లి లుక్..మాస్ యాంగిల్ లో రష్మీక గ్లామర్ అదుర్స్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా గ్లామర్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప.ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలను పెట్టుకున్నారు.అల్లు అర్జున్ మొదటిసారి పాన్ ఇండియా సినిమాలో చేస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

 Rashmika First Look As Srivalli From Pushpa Unveiled Details, Pushpa, Rashmika M-TeluguStop.com

ఇక తాజాగా ఈ సినిమా నుండి రష్మిక మందన్న లుక్ ను చిత్ర యూనిట్ రివీల్ చేసింది.ఈ సినిమాలో రష్మిక పుష్పరాజ్ భార్యగా శ్రీవల్లి పాత్రలో నటిస్తుంది.

ఈమె పాత్రను పరిచయం చేస్తూ రష్మిక గ్లామర్ స్టిల్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్.ఈ లుక్ లో రష్మిక మాస్ యాంగిల్ లో కనిపిస్తుంది.

ఈ లుక్ చూస్తేంటే శ్రీవల్లి తన భర్త పుష్పరాజ్ కోసం ఇష్టంగా రెడీ అవుతున్నట్టు ఉంది.

అప్పుడే పట్టు చీర కట్టుకునేందుకు రెడీ అవుతున్నట్టు ఈ లుక్ చుస్తే అర్ధం అవుతుంది.

రశ్మికలోని మాస్ యాంగిల్ ను సుకుమార్ చాలా అందంగా చూపించాడనే చెప్పాలి.ఈ సినిమాలో రష్మిక గిరిజన యువతిగా అచ్చం పల్లెటూరి భామలాగా కనిపిస్తుంది.ఇక ఈ లుక్ చూసిన అభిమానులు ఫెంటాస్టిక్ అంటున్నారు.ఇక ఈ పోస్టర్ లో రిలీజ్ డేట్ కూడా విడుదల చేయడం విశేషం.

Telugu @alluarjunfanss, @pushpamovie, @rashmikamandanna, Allu Arjun, Pushpa, Ras

ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.లవ్ స్టోరీ సినిమా సక్సెస్ అవ్వడంతో పుష్ప సినిమా కూడా దైర్యం చేసి విడుదల తేదీని ప్రకటించినట్టు కనిపిస్తుంది.మంచి కథ ఉంటే మన టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడు సినిమాలను ఆదరిస్తూనే ఉంటారు అని లవ్ స్టోరీ సక్సెస్ చూస్తేనే అర్ధం అవుతుంది.అందుకే ఇక పెద్ద పెద్ద సినిమాలు కూడా ఇప్పుడు క్యూ కట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Telugu @alluarjunfanss, @pushpamovie, @rashmikamandanna, Allu Arjun, Pushpa, Ras

ఇక పుష్ప సినిమా రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు.ఇక ఇప్పటికే మొదటి భాగం షూటింగ్ పూర్తి అయ్యింది.ఇందులో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పాత్రలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న రోల్ లో కనిపించ బోతున్నారు.ఇప్పటికే ఈ సినిమాలో బన్నీ లుక్ చూస్తేనే అర్ధం అవుతుంది.

సుకుమార్ బన్నీ ని ఏ రేంజ్ లో చూపించబోతున్నాడో.ఇక స్టైలిష్ స్టార్ అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube