హైదరాబాద్ లో మెట్రో రైలు విస్తరణకు చర్యలు వేగవంతం అయ్యారు.మూడో దశ డీపీఆర్ ల తయారీకి టెండర్లు ఖరారు అయ్యాయి.
ఈ క్రమంలోనే మెట్రో మూడో దశ పనుల కోసం కన్సల్టెన్సీని నియమించారు.మొత్తం ఐదు కంపెనీలు టెండర్లలో పాల్గొనగా ఆర్వీ అసోసియేట్స్ సంస్థ సాంకేతికంగా అర్హత సాధించింది.
కాగా అతి తక్కువ ఆర్థిక బిడ్ వేసిన ఆర్వీ అసోసియేట్స్ నాలుగు ప్యాకేజీల్లోనూ అర్హత సాధించింది.నిబంధనల ప్రకారం రెండు ప్యాకేజీలు ఆర్వీ అసోసియేట్స్ కేటాయించిన అధికారులు మిగతా రెండు సిస్ట్రా సంస్థకు కేటాయించారని సమాచారం.
ఈ క్రమంలోనే రెండు సంస్థలు రెండు నెలల్లో ట్రాఫిక్ సర్వేలతో పాటు రవాణా రద్దీ అంశాలపై విశ్లేషించనున్నాయి.అదేవిధంగా ట్రాఫిక్ అంచనాలు, వివిధ అంశాలపై అధ్యయనం చేసి రెండు నెలల్లో ప్రిలిమినరీ ప్రాజెక్టు రిపోర్టు రూపొందించనున్నాయి.
తరువాత మూడు నెలల్లో మెట్రో అలైన్మెంట్, స్టేషన్లు వంటి అంశాలపై అధికారులు అధ్యయనం చేయనున్నాయి.