మంచిగా మనసుపెట్టి ఆలోచించాలి కానీ డబ్బులు సంపాదించడానికి మనకు ఎన్నో మార్గాలు కనిపిస్తాయి.ఒక్కోసారి తెలివితో ఆలోచిస్తే అత్యంత త్వరగా ధనవంతులయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది.
అలాంటివారు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంటారు.తాజాగా ఆస్ట్రేలియాకు( Australia ) చెందిన 28 ఏళ్ల యువతి సెరీన్ లిమ్( Serene Lim ) కూడా కళ్ళు చెదిరే రీతిలో డబ్బును సంపాదిస్తూ యావత్తు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ఈ యువతి కంటెంట్‌ని క్రియేట్ చేయాలనే అభిరుచితో సోషల్ మీడియా మేనేజర్‌గా తన ఉద్యోగాన్ని విడిచిపెట్టింది.

ఇప్పుడు ఆమె కప్ 49, జెల్లే నెయిల్స్( Cup 49, Jelle Nails ) అనే రెండు వ్యాపారాలను నడుపుతోంది.తన యూట్యూబ్, టిక్‌టాక్ ఛానెల్‌లలో ప్రమోట్ చేస్తూ బిజినెస్ ని బాగా పెంచుకుంటుంది.సెరీన్ యూట్యూబ్ ఛానెల్‌కు 1.2 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.టిక్‌టాక్ ఛానెల్‌కు 2 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.
ఆమె అన్‌బాక్సింగ్ వీడియోలు, ప్రోడక్ట్ రివ్యూలు, ట్యుటోరియల్‌లతో సహా అనేక రకాల కంటెంట్‌ను సృష్టిస్తుంది.ఆమె ఇతర బ్రాండ్‌లతో కూడా కొలాబరేట్ అవుతుంది.

సెరీన్ వ్యాపారాలు నెలకు సగటున $213,000 ఆదాయాన్ని ఆర్జిస్తాయి.అంటే మన డబ్బుల్లో రూ.1 కోటి 70 లక్షల.ఆమె ప్రకటనలు, స్పాన్సర్‌షిప్‌లు, అనుబంధ మార్కెటింగ్‌తో సహా అనేక రకాల ఛానెల్‌ల ద్వారా డబ్బు సంపాదిస్తుంది.
క్రియేటివ్ కంటెంట్ సృష్టించడం ద్వారా ఆమె తన వ్యాపారాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది.అన్నింటా ఆమె విజయం సాధించింది.ఈ యువతి నడుపుతున్న జెల్లే నెయిల్స్ అనేది నెయిల్స్ స్టిక్కర్లను సేల్ చేస్తుంది.ఇంత చిన్న బిజినెస్ తో ఆమె నెలకే కోటి రూపాయలకు పైగా సంపాదించడం తెలిసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు.
ఆమె తెలివికి హాట్స్ ఆఫ్ చెప్పాలి అని కామెంట్ చేస్తున్నారు.







