వైసీపీ అధినేత సీఎం జగన్( CM Jagan ) రాజకీయ జీవితంలో చోటు చేసుకున్న విషయాలను వ్యూహం,( Vyooham ) శపథంగా( Shapadham ) ఆర్జీవి చిత్రీకరించడం జరిగింది.దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత వైఎస్ జగన్ రాజకీయ జీవితంలో చోటు చేసుకున్న విషయాలను ఈ రెండు సినిమాలలో చూపిస్తున్నారు.
ఓదార్పు యాత్రతో పాటు జగన్ జైలుకెలటం ఇంకా ప్రతిపక్ష నేతగా ఉండటం తర్వాత ముఖ్యమంత్రి కావటం అన్ని కీలక పాయింట్స్ కవర్ చేస్తూ రాంగోపాల్ వర్మ( Ram Gopal Varma ) ఈ రెండు సినిమాలు చిత్రీకరించారు.అయితే ఫిబ్రవరి 23 వ తారీకు వ్యూహం సినిమా విడుదల చేయబోతున్నట్లు మొదట ప్రకటించగా.
తాజాగా తేదీని మారుస్తూ ఆర్జీవి క్లారిటీ ఇచ్చాడు.మార్చి 1వ తారీకు “వ్యూహం”, మార్చి 8వ తారీకు “శపథం” విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేశారు.ఫిబ్రవరి 8వ తారీకు “యాత్ర 2”( Yatra 2 ) విడుదల కావడం జరిగింది.ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జగన్ జీవితంలో చోటుచేసుకున్న అంశాలను చిత్రీకరించారు.యాత్ర రెండో భాగంలో జగన్ పాత్రలో తమిళ హీరో జీవా నటించారు.
ఆర్జీవి తీసిన సినిమాలలో జగన్ పాత్రలో అజ్మల్ అమీర్ ( Ajmal Amir ) నటించడం జరిగింది.
గతంలో కూడా “వ్యూహం” సినిమా అనేకమార్లు వాయిదా పడింది.ఆ సమయంలో నారా లోకేష్( Nara Lokesh ) కోర్టులో సినిమాపై అభ్యంతరం తెలుపుతూ పిటిషన్ వేయటంతో సినిమా రిలీజ్ కాలేదు.ఆ తర్వాత న్యాయస్థానాలలో చిక్కుముడులు వీడటంతో ఫిబ్రవరి 23వ తారీకు సినిమా విడుదల చేస్తున్నట్లు ఆర్జీవి ప్రకటించారు.
ఈ క్రమంలో రేపు విడుదల కావలసి ఉండగా చివరి క్షణంలో వాయిదా పడటం సంచలనంగా మారింది.అయితే ఈసారి టెక్నికల్ కారణాల వల్ల నిర్ణయాం తీసుకున్నట్లు తెలిపారు.
ఈ వాయిదాకి లోకేష్ కారణం కాదని ఆర్జీవి సెటైర్ వేశారు.