RGV Vyooham : రేపు విడుదల కావలసిన..ఆర్జీవి “వ్యూహం” మరోసారి వాయిదా..!!

వైసీపీ అధినేత సీఎం జగన్( CM Jagan ) రాజకీయ జీవితంలో చోటు చేసుకున్న విషయాలను వ్యూహం,( Vyooham ) శపథంగా( Shapadham ) ఆర్జీవి చిత్రీకరించడం జరిగింది.

దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత వైఎస్ జగన్ రాజకీయ జీవితంలో చోటు చేసుకున్న విషయాలను ఈ రెండు సినిమాలలో చూపిస్తున్నారు.

ఓదార్పు యాత్రతో పాటు జగన్ జైలుకెలటం ఇంకా ప్రతిపక్ష నేతగా ఉండటం తర్వాత ముఖ్యమంత్రి కావటం అన్ని కీలక పాయింట్స్ కవర్ చేస్తూ రాంగోపాల్ వర్మ( Ram Gopal Varma ) ఈ రెండు సినిమాలు చిత్రీకరించారు.

అయితే ఫిబ్రవరి 23 వ తారీకు వ్యూహం సినిమా విడుదల చేయబోతున్నట్లు మొదట ప్రకటించగా.

"""/" / తాజాగా తేదీని మారుస్తూ ఆర్జీవి క్లారిటీ ఇచ్చాడు.మార్చి 1వ తారీకు "వ్యూహం", మార్చి 8వ తారీకు "శపథం" విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఫిబ్రవరి 8వ తారీకు "యాత్ర 2"( Yatra 2 ) విడుదల కావడం జరిగింది.

ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జగన్ జీవితంలో చోటుచేసుకున్న అంశాలను చిత్రీకరించారు.

యాత్ర రెండో భాగంలో జగన్ పాత్రలో తమిళ హీరో జీవా నటించారు.ఆర్జీవి తీసిన సినిమాలలో జగన్ పాత్రలో అజ్మల్ అమీర్ ( Ajmal Amir ) నటించడం జరిగింది.

"""/" / గతంలో కూడా "వ్యూహం" సినిమా అనేకమార్లు వాయిదా పడింది.ఆ సమయంలో నారా లోకేష్( Nara Lokesh ) కోర్టులో సినిమాపై అభ్యంతరం తెలుపుతూ పిటిషన్ వేయటంతో సినిమా రిలీజ్ కాలేదు.

ఆ తర్వాత న్యాయస్థానాలలో చిక్కుముడులు వీడటంతో ఫిబ్రవరి 23వ తారీకు సినిమా విడుదల చేస్తున్నట్లు ఆర్జీవి ప్రకటించారు.

ఈ క్రమంలో రేపు విడుదల కావలసి ఉండగా చివరి క్షణంలో వాయిదా పడటం సంచలనంగా మారింది.

అయితే ఈసారి టెక్నికల్ కారణాల వల్ల నిర్ణయాం తీసుకున్నట్లు తెలిపారు.ఈ వాయిదాకి లోకేష్ కారణం కాదని ఆర్జీవి సెటైర్ వేశారు.

మెగాస్టార్ పీఠాన్ని కైవసం చేసుకునే ఆ స్టార్ హీరో ఎవరు..?